Karimnagar: తరాలు మారినా.. యుగాలు మారినా మూఢ నమ్మకాల విషయంలో కొందరి అభిప్రాయాలు మాత్రం మారటం లేదు. గుడ్డిగా మూఢ నమ్మకాలను పాటిస్తున్నారు. సైన్స్‌తో పరిష్కారం కనుక్కోవటానికి బదులు అంధ విశ్వాసాలను అమలు చేస్తున్నారు. తాజాగా, ఓ గ్రామం మూఢ నమ్మకానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. గ్రామంలో వరుసగా 3 మరణాలు చోటుచేసుకోవటంతో గ్రామస్తులు ఏకంగా ఊరినే ఖాళీ చేశారు. ఓ రోజు మొత్తం ఇలా ఊరిని వదిలేయాలని నిశ్చయించుకున్నారు. ఊరి బయట తలదాచుకుంటున్నారు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలోని రామన్నపల్లి గ్రామంలో నెల రోజుల వ్యవధిలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. దీంతో గ్రామస్తుల్లో భయం మొదలైంది.
ఈ నేపథ్యంలోనే తమ గ్రామానికి ఏదో కీడు సోకిందని గ్రామస్తులు భావించారు. ఇందుకు పరిష్కారంగా జనం ఊరిని వదిలి పెట్టి, ఉదయం నుంచి సాయంత్రం వరకు పంట పొలాల్లో ఉండాలని నిశ్చయించున్నారు. దాదాపు 300 కుటుంబాలు ఉదయమే గ్రామాన్ని విడిచిపెట్టాయి. పంట పొలాల్లోకి చేరుకున్నాయి. ఎవరూ గ్రామంలో లేకపోయేసరికి గ్రామం మొత్తం నిర్మానుషంగా మారింది. ఇక పంట పొలాలు జనంతో కలకల్లాడుతున్నాయి. ఈ నిర్ణయం వేద పండితుల సూచన మేరకే తీసుకున్నట్లు జనం చెబుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కేసీఆర్ ను ఓడించేదాకా నిద్రపోను: ఎమ్మెల్యే ఈటల రాజేందర్