ట్విట్టర్.. దీనిని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అనేకంటే ప్రచార సాధనం అనొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌ని తమ అభిప్రాయాలను వెల్లడించడానికే కాదు.. సమాచారాన్ని చేరవేయడానకి కూడా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా అధికారులు, రాజకీయనేతలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్ఫ్లూఎన్సర్స్, సెలబ్రిటీలు ఇలా ఎందరో ఈ ట్విట్టర్‌ని ఉపయోగించి తమ అభిమానులు, ఫాలోవర్లు, ప్రజలను చేరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ ట్విట్టర్ కొత్త రూల్స్ ని తీసుకురాబోతోంది. ఈ రూల్స్ అన్నింటిని పక్కనబెడితే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఇకపై ట్విట్టర్లో స్క్రీన్ షాట్ తీయడం కుదరదంట. అవును స్క్రీన్ షాట్‌కి బదులుగా ట్వీట్‌ని షేర్ చేయమని నోటిఫికేషన్ వస్తోంది.
ట్విట్టర్ లో స్క్రీన్ షాట్ తీస్తున్న సమయంలో నోటిఫికేషన్ రావడాన్ని మొదట యాప్ పరిశోధకులు జేన్ మంచున్ వాంగ్ గమనించారు. స్క్రీన్ షాట్ తీస్తున్న సమయంలో ఒక పాప్ అప్ వస్తున్నట్లు గుర్తించారు. అందులో స్క్రీన్ షాట్ తీసుకునే బదులు ట్వీట్ ని షేర్ చేయడం, లేదా లింకుని కాపీ చేయాల్సిందిగా సూచిస్తోంది. అంటే దాని అర్థం స్క్రీన్ షాట్ తీసి ఫార్వార్డ్ చేసే బదులు సోషల్ ప్లాట్ ఫామ్ లో ఈ ట్వీట్ ని రీట్వీట్ చేయడం చేయమని కోరుతోంది. అంటే అలా చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మంది వారి యాప్ కు వస్తారనేది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. తద్వారా మరింత మందిని ట్విట్టర్ వాడకానికి అలవాటు పడేలా చేయడానికి చూస్తోందని టెక్ నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Twitter’s edit button is finally here pic.twitter.com/8BqO5bs4ef
— Dexerto (@Dexerto) October 3, 2022
అంతేకాకుండా ట్విట్టర్ న్యూ రూల్స్ లో ఎడిట్ బటన్ కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా దేశాల్లో విడుదల అయ్యింది. కాకపోతే ప్రస్తుతం బ్లూ టిక్ ఉన్న సబ్ స్క్రైబర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ట్విట్టర్ వినియోగదారులకు మరో అద్భతమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అదేంటంటే.. ఒకే ట్వీట్ లో ఇకనుంచి ఫొటోలు, వీడియోలు, జిఫ్ లు అన్నీ షేర్ చేయవచ్చు. ఎప్పటినుంచే ఆ ఆప్షన్ ను పరిశీలిస్తున్న ట్విట్టర్ తాజాగా యాండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్ల కోసం ఈ ఫీచర్ ని విడుదల చేసింది. ఎడిట్ బటన్ కూడా అందరికీ అందుబాటులోకి వస్తే.. ట్విట్టర్ వినియోగం మరింత పెరుగుతుందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు.
Morram de inveja. Aqui nos EUA, o Twitter liberou a função de editar tweets! 🙂 pic.twitter.com/p4GtgB3zvH
— Leandro Ruschel 🇧🇷🇺🇸🇮🇹🇩🇪 (@leandroruschel) October 6, 2022
Get ready to mix it up with visuals on Twitter.
You can now add a combination of media to your Tweet on Android and iOS. That means you can include a photo, GIF, and video (or two!) all in the same Tweet. Tap the photo icon in the Tweet composer to start mixing your media. pic.twitter.com/9D1cCzjtmI
— Twitter Support (@TwitterSupport) October 5, 2022