5జీ నెట్ వర్క్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని గురించే చర్చ జరుగుతోంది. 5జీ వస్తే సాకేంతికంగా అలా మారిపోతుంది, కొత్త ఆవిష్కరణలు వస్తాయి అంటూ ఇలా చాలా రకాలుగా ప్రజలు 5జీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఎయిర్‌టెల్, జియో కంపెనీలు తమ 5జీ సర్వీసెస్‌ని ప్రారంభించాయి కూడా. ఎయిర్‌టెల్ అయితే దేశవ్యాప్తంగా 8 నగరాల్లో తమ 5జీ సేవలను ప్రారంభించింది. అది కూడా జియో కంటే ముందే సర్వీసెస్‌ని స్టార్ట్ చేసింది. ముంబయి, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, వారణాసి, సిలిగురి, నాగ్‌పూర్ లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు ప్రస్తుతం ఉన్న 4జీ నెట్‌వర్క్ టారిఫ్ ప్లాన్లతోనే 5జీ సేవలను అందిస్తోంది. 5జీ కోసం అదనంగా ఏమీ ఛార్జెస్ వసూలు చేయడం లేదు.
ఇంక జియో విషయానికి వస్తే.. జియో కూడా తమ 5జీ సేవలను ప్రారంభించింది. నిజానికి డిసెంబర్ 8 నుంచి దేశవ్యాప్తంగా జియో 5జీ టెస్టింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. కానీ, ఎయిర్‌టెల్ ప్రారంభించింది అని జియో కూడా ముందే 4 నగరాల్లో 5జీ టెస్టింగ్ ప్రారంభించినట్లు కనిపిస్తోంది. జియో కంపెనీ ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, వారణాసి నగరాల్లో తమ 5జీ నెట్‌వర్క్ సేవలను ప్రారంభించింది. ఈ టెస్టింగ్ సమయంలో జియో నెట్‌వర్క్ యూజర్లకు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందించనున్నారు. మరి.. తర్వాత ప్లాన్ వివరాలు ఎలా ఉంటాయి అనే అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. అయితే ఇప్పుడు ఎయిర్‌టెల్, జియో రెండు నెట్‌వర్క్ లు 5జీ సేవలు ప్రారంభించడంతో ఎవరిది వాస్ట్ నెట్‌వర్క్ అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అందుకు తగినట్లుగా ఎయిర్‌టెల్, జియో 5జీ నెట్‌వర్క్ డౌన్లోడ్ స్పీడ్ ఎంతో తెలిసింది.
ముంబయి నగరంలో డౌన్లోడ్ స్పీడ్:
ఢిలీ నగరంలో డౌన్లోడ్ స్పీడ్:
వారణాసి నగరంలో డౌన్లోడ్ స్పీడ్:
కోల్‌కతా నగరంలో డౌన్లోడ్ స్పీడ్:
ఏ నగరం చూసినా కూడా జియో 5జీ నెట్‌వర్క్ ఎయిర్‌టెల్ కంటే చాలా స్పీడ్‌గా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క వారణాసిలో మాత్రం ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ స్పీడ్‌గా ఉంది. కోల్‌కతా విషయానికి వస్తే అసలు ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ 4జీ స్పీడ్‌తో కూడా వస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ 5జీ సేవలు పూర్థిస్థాయిలో అందుబాటులోకి వస్తే రెండు కంపెనీలు ఎలాంటి టారిఫ్ ప్లాన్లు తీసుకొస్తాయి? ఎంత డేటాను పర్ డేకి ఇస్తాయి? అనేవి మాత్రం ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నలు.
Airtel 5G
Good Download Speed But Upload Could have been far better
Waiting for Jio Standalone 5G pic.twitter.com/pm43WE4H9O
— Utsav Techie (@utsavtechie) October 9, 2022
#RelianceJio recorded almost 600 Mbps median download speed on its #5G network in Delhi while India’s overall 5G speed hit 500 Mbps as the country rolled out 5G services, a report showed. pic.twitter.com/uXA8aviCA5
— Atulkrishan (@iAtulKrishan) October 11, 2022
Jio 5G download & Upload speed. https://t.co/8rCUg0b5cQ
— Prince Maurya (@TechStyle_47) October 6, 2022