స్కూటర్లలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపే ఎక్కువగా మొగ్గుతున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాల వల్ల తక్కువ ఖర్చుతోనే ప్రయాణం చేయచ్చు. పైగా వీటి మోయిన్టినెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. పర్యావరణానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. తాజాగా ప్రివైల్ ఎలక్ట్రిక్ అనే కంపెనీ నుంచి 3 సరికొత్త మోడల్స్ విడుదలయ్యాయి. వాటి ధర కూడా బడ్జెట్ లోనే ఉండటం అందరినీ ఆకర్షిస్తోంది.
ఇప్పుడు అందరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ ని కొనేందుకే మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ అనేది సింగిల్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్ లాంటిది. ఒక్కసారి మీరు వెహికల్ కొన్నాక రోజుకి కేవలం రూ.3 నుంచి రూ.10 ఖర్చుతోనే మీ ప్రయాణాలు జరిగిపోతాయి. పైగా ఈ వాహనాల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరగడమే కాకుండా.. పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మీకు రాయితీలు కూడా లభిస్తున్నాయి. ఇవి కూడా కాస్త ఖరీదుగా ఉండటం అందరినీ ఆలోచనల్లో పడేస్తున్నాయి. అయితే ధర ఎక్కువని ఈవీలు కొనుగోలు చేయని వారికోసం ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవీని తీసుకొచ్చాం.
ప్రివైల్ ఎలక్ట్రిక్ అనే కంపెనీ నుంచి అదిరిపోయే స్టేలిష్ లుక్స్ లో మూడు ఈవీ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ఫీచర్స్, బ్యాటరీ కెపాసిటీ, డ్రైవ్ రేంజ్ ని బట్టి వీటి ధరలు ఉంటాయి. లుక్స్ పరంగా మాత్రం అన్నీ యునీక్ గా అనిపిస్తాయి. దీనిలో ప్రివైల్ ఎలక్ట్రిక్ ఎలైట్, ఫైనెస్, వోల్ఫురీ అనే మోడల్స్ ఉన్నాయి. ఈ కంపెనీ బండ్లను మీరు నిశ్చింతగా కొనచ్చు. ఎందుకంటే వీళ్లు బైబ్యాక్ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు. మీరు కొన్ని ప్రివైల్ ఎలక్ట్రిక్ వాహనాన్ని తిరిగి విక్రయించాలి అనుకుంటే తామే కొంటామంటూ ప్రకటించింది. గరిష్టంగా రూ.65 వేల వరకు మీ పాత వాహనానికి ధర లభిస్తుంది. పెట్రోల్ వాహనాలకు లభించే బైబ్యాక్ గ్యారెంటీ కంటే ఇది కాస్త ఎక్కువ మొత్తం అనే చెప్పచ్చు.
ఇంక ఈ ప్రివైల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాహనాల ఫీచర్స్ విషయానికి వస్తే.. గరిష్టంగా 1000 వాట్స్ పవర్ ఫుల్ మోటర్ తో వస్తున్నాయి. గరిష్టంగా 220 కిలోమీటర్ల రేంజ్ తో వస్తున్నాయి. మూడేళ్ల వారెంటీ లభిస్తుంది. 200 కిలోల వరకు బరువును మోయగలదు. ఇందులో స్వాపబుల్ బ్యాటరీస్ ఉన్నాయి. 0 నుంచి 100 శాతం ఫుల్ అవ్వడానికి 8 గంటల వరకు సమయం పడుతుంది. 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించ గలదు. మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, ఎల్సీడీ స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్ ద్వారా నేవిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, కాల్ యాక్సెప్ట్, రిజెక్ట్ చేయవచ్చు. డిస్క్ బ్రేక్స్, చైల్డ్ లాక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో రివర్స్ గేర్ కూడా ఉంది. వీటి ధర ఎలైట్- రూ.1,29,000, ఫైనెస్ రూ.99,999, ఉల్ఫరీ- రూ.89,999గా ఉంది.