వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ సోషల్ మెసేజింగ్ యాప్ టాప్ ప్లేస్‌లో ఉంది. ప్రస్తుతం మెసేజ్‌లు, గ్రూప్ చాటింగ్, వీడియోకాల్, గ్రూప్ వీడియోకాలింగ్, పేమెంట్స్ కోసం కూడా వాట్సాప్‌ని వినియోగిస్తున్నారు. వాట్సాప్ ఎప్పటికప్పుడు తమ వినియోగదారుల కోసం అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తెస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే గత కొద్ది రోజులుగా కొన్ని ఫీచర్ల గురించి బాగా వినిపిస్తోంది. వాటిలో మొత్తం 5 ఫీచర్లు ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం వాట్సాప్ నుంచి రాబోతున్న ఫీచర్ల గురించే చర్చ జరుగుతోంది. వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? వాటివల్ల సెక్యూరిటీ ఏమైనా పెరుగుతుందా? వ్యక్తిగత గోప్యత మరింత పెరుగుతుందా? అనే ప్రశ్నలు అడుగుతున్నారు. మరి ఆ ఫీచర్లు ఏంటో చూద్దాం.
చాలా సోషల్ మీడియాలో యాప్‌లలో ఈ మెసేజ్ ఎడిట్ అనే ఆప్షన్ ను యూజర్లు కోరుకుంటున్నారు. అయితే అలాంటి ఎడిట్ మెసేజ్ ఫీచర్‌ని వాట్సాప్ తీసుకురానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఆప్షన్ టెస్టింగ్ స్థాయిలో ఉందని చెబుతున్నారు. కాకపోతే ఎప్పుడుపడితే అప్పుడు ఎడిట్ చేసే అవకాశం ఉండదని, దానికి నిర్ణీత సమయం ఉంటుందని చెబుతున్నారు. మీరు మెసేజ్ చేసిన 15 నిమిషాల లోపు ఎడిట్ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఇప్పటివరకు వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలను సెండ్ చేసుకునే సమయంలో వాటికి క్యాప్షన్ ని జోడించి పంపిస్తాం. అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్‌ని తీసుకురానుదం. అదేంటంటే.. మీరు వేరే వాళ్లకు సెండ్ చేసే డాక్యుమెంట్‌కి కూడా ఇకనుంచి క్యాప్షన్ పెట్టి పంపించవచ్చు.
వాట్సాప్ గ్రూపులో గరిష్టంగా 512 మందిని మాత్రమే యాడ్ చేసుకునే వీలుంది. ఇప్పటినుంచి ఆ సంఖ్యను మరింత పెంచనున్నారు. దానిని రెట్టింపు చేస్తూ 1,024కు పెంచుకునేలా వాట్సాప్‌ని అప్‌డేట్ చేయనున్నారు. అంటే ఇకనుంచి ఏదైనా గ్రూపులో 1,024 మంది సభ్యులను యాడ్ చేసుకోవచ్చు అనమాట.
వాట్సాప్‌లో బిజినెస్ అకౌంట్లు కూడా ఉన్నాయనే విషయం తెలిసిందే. అయితే ఇకనుంచి బిజినెస్ అకౌంట్లకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకురానున్నారు. ఇప్పటివరకు బిజినెస్ అకౌంట్లను ఫ్రీగా వాడుకున్న వారంతా ఇకపై ఆ సేవలు కావాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఎంత కట్టాలి అనేది వెల్లడించకపోయినా కూడా ప్రీమియం అమౌంట్ ఉంటుందని చెబుతున్నారు.
ఇంక చివరిగా వాట్సాప్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే రాబోయే రోజుల్లో వాట్సాప్ చాటింగ్‌లో స్క్రీన్ షాట్ తీసే సదుపాయాన్ని తీసేయనున్నారు. గతంలో.. పెట్టిన మెసేజ్ డిలీట్ చేస్తారనే అనుమానం ఉంటే.. ముందుగా ఆ చాట్‌ని స్క్రీన్ షాట్ తీసుకునేవారు. ఇప్పుడు యూజర్ గనుక వద్దు అనుకుంటే ఇకపై మీరు వారి చాటింగ్ స్క్రీన్ షాట్స్ తీసే అవకాశం ఉండదు. ఇలా స్క్రీన్ షాట్స్ తీసుకోకుండా ఉండేలా చేయాలంటే యూజర్లు వ్యూవ్ వన్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. అలా సెలక్ట్ చేసుకుంటే మీ చాటింగ్‌ని స్క్రీన్ షాట్స్ తీసుకోలేరు. అయితే ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుందనేది తెలియాల్సి ఉంది.