జనాభా పెరుగుతోన్న కొద్దీ వాహన వినియోగం పెరుగుతోంది. ఈ కారణంగా ట్రాఫిక్ కష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మెట్రో సిటీల్లో అయితే మరీను.. ఏదైనా పని ఉందని పది నిమిషాల బయటకు వస్తే తిరిగి ఇంటికి ఎప్పుడు వెళ్తామో కూడా తెలియడం లేదు. దీనికి పరిష్కారం.. గాలిలో ఎగరడడమే. అంటే.. గాలిలో ప్రయాణించడమే అని. ఇప్పటివరకు ప్లైట్లు, హెలికాప్టర్ల ద్వారా గాలిలో ఎగిరిన మనం ఇకపై.. కార్లు, బైకుల్లో చక్కర్లు కొట్టనున్నాం. ఆ దిశగా ప్రయోగాలు ఎప్పటినుంచో సాగుతున్నా.. విజయవంతమైన సందర్భాలు చాలా తక్కువ. ఈ తరుణంలో చైనాకు చెందిన ఓ సంస్థ ఎలక్ట్రిక్ ప్లైయింగ్ కారును విజయవంతంగా ప్రయోగించింది.
చైనాకు చెందిన గ్వాంజొ అనే సంస్థ ‘జిపెంగ్ ఎక్స్ 2’ ఫ్లయింగ్ కారును దుబాయి వేదికగా విజయవంతంగా పరీక్షించింది. ఇందులో ఇద్దరు మాత్రమే ప్రయాణించొచ్చు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. చుట్టూ ఉన్న 8 ప్రొపెలర్ సెట్ ద్వారా కారు శక్తిని పొందుతుంది. ఇది విమానాలు,హెలికాప్టర్ల మాదిరిగా కాకుండా..ఇవిఐఒఎల్(ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్) ఆధారంగా టేకాఫ్, ల్యాండింగ్ ఉంటుంది. రన్ వేలు అవసరం లేదు. నిట్టనిలువుగా ఎగరగలవు. ఈ కారు రోజంతా ప్రయాణం చేయగలదట. అయితే బ్యాటరీ లైఫ్, ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, మౌలిక సదుపాయల వంటి సవాళ్లను అధిగమించాల్సి ఉంది.
FLYING CAR LIFTS OFF IN DUBAI!
Unveiled at GITEX GLOBAL, the XPENG AEROHT is the largest flying car company in Asia. Not available for sale just yet, their vehicle is reportedly up and running for test flights. 1/2 pic.twitter.com/nhMgLvOYQz— Lovin Dubai | لوڤن دبي (@lovindubai) October 11, 2022
పరీక్షలు విజయవంతమైనప్పటికీ, ఇవి అందుబాటులోకి రావడానికి చాలా సమయమే పట్టేలా ఉంది. అందులో కూర్చొని ఎలా ప్రయాణిస్తారు అన్న దృశ్యాలను నిర్వాహకులు కళ్ళకు కట్టినట్లు చూపించారు. దీనిపై విదేశాంగ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా కూడా స్పందించారు. అమెరికా, కెనడాలో ట్రయల్స్ ముగిసిన తర్వాత మన దేశంలో కూడా ట్రయల్స్ నిర్వహిస్తామని తెలిపారు. సో.. మన దేశంలో కూడా గాలిలో ఎగిరే కార్లు రయ్ రయ్ అంటూ ఎగరనున్నాయి.
CORRECTION: With two seats and zero carbon emissions, XPeng’s eVTOL flying car X2 takes flight in Dubai in public for the first time. We are deleting a previous tweet to amend the duration of flight to 90 seconds instead of 90 minutes https://t.co/25zFZ8R5Fy pic.twitter.com/EOLffF897k
— Reuters (@Reuters) October 13, 2022