దేశంలో.. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక విమానాల్లో ఉపయోగించే ఇంధనం ధర లీటర్.. లక్షకు దగ్గరలో ఉంది. ఇంత ధర ఉన్నప్పుడు విమాన చార్జీలు భారీగా ఉండడంలో..ఎలాంటి సందేహం లేదు. కానీ, అందుకు విరుద్ధంగా ఏకంగా కిలోమీటరుకు రూ.12 చార్జీతో.. ఎయిర్ ట్యాక్సీ ప్రయాణాన్ని అందిస్తామని ఒక సంస్థ ముందుకొచ్చింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది వాస్తవం అంటున్నారు సదరు కంపెనీ యాజమాన్యం.
క్రికెటర్ యువరాజ్ సింగ్, పారిశ్రామికవేత్త పునీత్ దాల్మియా పెట్టుబడులు పెట్టిన ప్రైవేట్ జెట్ విమాన సేవల సంస్థ అయిన జెట్ సెట్ గో.. ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్–ఆఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటోల్) ఎయిర్‌క్రాఫ్ట్స్‌తో ఇది సాధ్యమని చెబుతోంది. నగరాల్లో ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్లడం ఎంతో ప్రయాసతో కూడుకున్న వ్యవహారం.ట్రాఫిక్ ఎక్కువుగా ఉన్న సమయంలో.. గంటకు 15- 20 కిలోమీటర్ల సగటు వేగాన్ని మించలేం. ఆకాశ మార్గాన హెలికాఫ్టర్లలో వెళదామా అంటే.. ఖర్చు ఎక్కువుగా ఉంటుంది. దీనికి పరిష్కారంగా ఈవీటోల్స్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జెట్ సెట్ గో సంస్థ ఏవియేషన్ సర్వీసెస్ ఫౌండర్ కనిక టేక్రివాల్ రెడ్డి వెల్లడించారు. ఈ తరహా సేవలను హైదరాబాద్ లో ప్రారంభించేందుకు కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతున్నట్లు ఆమె వివరించారు. మలిదశలో ముంబయి, బెంగళూరుల్లో సేవలు ప్రారంభిస్తామన్నారు.
పైలట్ ఉండని భారీ డ్రోన్లలో ఒకేసారి నలుగురు ప్రయాణించే సదుపాయమే ఈవీటోల్స్. ఈ డ్రోన్లు ఒకసారి ఛార్జింగ్‌తో 40 కిలోమీటర్లు ప్రయాణించగలవు. కిలోమీటరుకు ఒక వ్యక్తికి రూ.12 ఖర్చు అవుతుంది. ఎయిర్ బస్, మరికొన్ని సంస్థలు ఈ డ్రోన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇప్పటివరకు అద్దెకు ప్రైవేట్ విమానాలను నడుపుతున్న ఈ సంస్థ ఈవీటోల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ద్వారా ఎయిర్ ట్యాక్సీ రంగంలోకి రావాలని నిర్ణయం తీసుకొంది.
4 eVTOL trends moving the air taxi industry closer to takeoff https://t.co/w6Z6uG227a by @overair_inc
— TechCrunch (@TechCrunch) March 17, 2022
మూడేళ్లలో వినియోగంలోకి..
ప్రపంచవ్యాప్తంగా 12 సంస్థలు ఈవీటోల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ తయారీలో ఉన్నాయి. వీటిని నడపడానికి పైలట్ అవసరం లేదు. పైకి లేచినప్పుడు, కిందకు దిగేప్పుడు నిటారుగా ప్రయాణిస్తాయి. ల్యాండింగ్, టేకాఫ్ కోసం ల్యాండింగ్ ప్యాడ్స్ అవసరం. ఒకసారి చార్జింగ్‌తో 40 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. కిలోమీటరుకు అయ్యే చార్జీ రూ.12 మాత్రమే. ఈవీటోల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఖరీదు సుమారు రూ.23 లక్షలు ఉంటుంది. ల్యాండింగ్ ప్యాడ్ 8 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు ఉంటే చాలు.
‘World’s first’ four-seater flying TAXI is unveiled https://t.co/hkzpjBRrEt
via @MailOnline#FlyingCar #AirTaxi #drone #UAM #aviation #aircraft@SpirosMargaris @mvollmer1 @enricomolinari @Nicochan33 @Shi4Tech @PawlowskiMario @FrRonconi pic.twitter.com/aOhlkabScg— Jeroen Bartelse (@JeroenBartelse) March 22, 2022
ప్రస్తుతం జెట్ సెట్ గో వద్ద 22 జెట్స్, 2 హెలికాప్టర్స్ ఉన్నాయి. 80 మంది పైలట్లు ఉన్నా రు. కొత్తగా ఈ ఏడాది నాలుగు జెట్స్, ఒక హెలికాప్టర్ జతకూడనున్నాయి. అద్దె గంటకు రూ.1.3 లక్షల నుంచి ప్రారంభం. 120 దేశాల్లోని 600లకు పైగా విమానాశ్రయాల్లో అడుగుపెట్టాం. రోజుకు సగటున 75 ల్యాండింగ్స్ నమోదు చేస్తున్నామన్నారు.
JetSetGo Aviation becomes the first Indian leasing company to bring an aircraft into the country under the Direct Leasing Arrangement
A Hawker 800 XP aircraft imported from the United Kingdom, landed at Mihan-SEZ in Nagpur on Thursday pic.twitter.com/MJXQE51lbl
— aneesh phadnis (@aneeshp) August 20, 2021
తొలి స్థానంలో హైదరాబాద్..
ప్రైవేట్ జెట్స్ రాకపోకల విషయంలో దేశంలో హైదరాబాద్ తొలి స్థానంలో ఉంది. బేగంపేట విమానాశ్రయంలో కోవిడ్‌కు ముందు సగటున రోజుకు 2–3 ప్రైవేట్ జెట్స్ ల్యాండ్ అయ్యేవి. ఇప్పుడు 15 అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 250 నుంచి 300 వరకు ఉంది. రానున్న రోజుల్లో 500 వరకు పెరగొచ్చు. భారత్‌లో ప్రైవేట్ వ్యక్తులు, కంపెనీల వద్ద 95 జెట్స్, హెలికాప్టర్స్ ఉన్నాయి. వీటిలో 7 తెలుగు రాష్ట్రాల వారివి.
#JetSetGo, Way to Gohttps://t.co/RWLfzqqGVl#Aviation #Civil #Aerospace #BizAv #Businessjets @jetsetgoin pic.twitter.com/kOSZd6XKLb
— SP’s Aviation (@SPsAviation) July 8, 2016
”My team and I at #JetSetGo, look forward to improving the overall standard of domestic #businessaviation”https://t.co/3y7ZWxBlg1#Aviation #Aerospace #Bizav #bizjet #BusinessJet #BusinessJets #BusinessAircraft #avgeek #avgeeks #PrivateJets #DGCA #KanikaTekriwal @jetsetgoin pic.twitter.com/hUuTVzghHi
— BizAvIndia Magazine (@BizAvIndiaMag) June 15, 2018