టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు భారత జట్టుకు ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఇద్దరూ గాయంతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. ఒంటి చేతుల్లో మ్యాచ్‌ని మలుపు తిప్పగల ఇద్దరు కీ ప్లేయర్లు లేకుండా టీ20 వరల్డ్ కప్ ఆడనుంది టీమిండియా. ఈ తరుణంలో వీరిద్దరూ లేకుండా 6 జట్ల మధ్య జరిగిన ఆసియా కప్ నే గెలవలేని జట్టు.. ఇప్పుడు వరల్డ్ కప్ గెలుస్తుందా? అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.. అభిమానులు. ఇప్పుడు టీమిండియాను కాపాడే మొనగాడు ఎవరా? అని లెక్కలేసుకుంటున్నారు.
భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.. ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేసిన జట్టులో మిగిలిన భారత పేసర్లు. అప్పటివరకు వీరైనా అందుబాటులో ఉంటారా! అన్నది కూడా అంతుచిక్కని ప్రశ్నే. బుమ్రా సంఘటనే అందుకు ఉదాహరణ. నిన్నటివరకు వీరికి తోడు బుమ్రా ఉన్నాడనుకుంటే.. ఇవాళ అతనూ లేడు. గాయంతో దూరమయ్యాడు. దీంతో భారత బౌలింగ్ లైనప్ చాలా వీక్ గా కనిపిస్తోంది. ఈ క్రమంలో గాయపడ్డ బుమ్రా స్థానంలో షమీనైనా జట్టులోకి తీసుకోవాలని అభిమానులు సెలెక్టర్లకు మొరపెట్టుకుంటున్నారు. కనీసం అతడినైనా జట్టులోకి తీసుకుంటే.. జట్టును కాపాడతాడన్నది వారి అభిప్రాయం.
This is what the senior BCCI official had to say about Bumrah’s injury👀 #JaspritBumrah #T20WorldCup2022 pic.twitter.com/apXMEhU09n
— News18 CricketNext (@cricketnext) September 29, 2022
షమీని ఎంపిక చేస్తే.. షమీ, హర్షల్ పటేల్, అర్షదీప్ లతో భారత జట్టు కాస్త బలంగానే కనిపిస్తుంది. కనీసం టైటిల్ గెలవకపోయినా పరువు నిలబెట్టుకోవచ్చన్నది విమర్శకుల వాదన. అయితే.. ఏడాదిగా టీ20లకు ఎంపిక చేయకుండా వస్తున్న బీసీసీఐ ఇప్పుడు అలాంటి సాహసం చేస్తుందా? అన్నది చూడాలి. ఒకవేళ షమీ కాదనుకుంటే, గాయంతో ఆరు నెలలు అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉన్న దీపక్ చాహార్‌ని మిగిలిన మ్యాచుల్లో ఆడించి, మెగా టోర్నీకి సిద్ధం చేయాల్సి ఉంటుంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు ఇక మిగిలింది రెండు టీ20 మ్యాచులే. ఈ రెండు కాకుండా అధికారికంగా మరో రెండు వార్మప్ మ్యాచులు. ఈ నేపథ్యంలో ఎవరు ఉంటారో, ఎవరు ఉండరో అంతుపట్టడం లేదు.
🚨NEWS ALERT 🚨
Mohammad Shami has tested negative for Covid-19 🏏#MohammadShami #India #TeamIndia #CricketTwitter pic.twitter.com/NFH9fOVE2A
— Sportskeeda (@Sportskeeda) September 28, 2022
సాధారణంగా ప్రపంచ కప్‌నకు ఐదారు నెలల ముందే, జట్లు తమ ప్లేయింగ్-11ని దాదాపుగా ఖరారు చేస్తాయి. అదే కలయికతో టోర్నమెంట్‌కు ముందు చివరి కొన్ని మ్యాచ్‌లను ఆడతాయి. ఈసారి మాత్రం అలా జరగలేదు. ఆసియా కప్ డిజాస్టర్ తర్వాత భారత జట్టులో మార్పు వస్తుందని అంతా భావించారు. అయినా ఆలా జరగలేదు. మ్యాచుకో కొత్త బౌలర్ ని బరిలోకి దింపుతున్నారు. కెప్టెన్, కోచుల ఊహలేంటో ఎవరకి అర్థమవ్వడం లేదు. ఇలాంటి ప్రయోగాలతో భారత జట్టు వరల్డ్ కప్ గెలుస్తుందా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.
Team India won’t be the same without these two match winners in T20 World Cup 2022 💔 pic.twitter.com/zZCv0joyA8
— CricTracker (@Cricketracker) September 29, 2022