కేరళ యువ బ్యాటర్ సంజూ శాంసన్ కు బీసీసీఐ అన్యాయం చేస్తుందని విమర్శలు వెళ్లువెత్తిన సంగతి తెలిసిందే. అతడికి టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంతో పాటు స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపిక చేయకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తిరువనంతపురం వేదికగా జరిగిన ఇండియా- సౌతాఫ్రికా మ్యాచుకు ముందు.. బీసీసీఐకి, సెలెక్టర్లకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ఈ తరుణంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఒక మెట్టు దిగారు. అతడికి జట్టులో చోటు పక్కా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ వివరాలు..
7 ఏళ్ల క్రితం 2015 జులైలో జింబాబ్వేతో జరిగిన మ్యాచులో అంతర్జాతీయ టీ20ల్లో అరంగ్రేటం చేసిన శాంసన్.. ఈ ఏడేళ్లలో ఆడింది 16 మ్యాచులే. టాలెంట్ లేక అంటే.. కాదు. అవకాశాలు రాక. జట్టుకు ఎంపిక చేసిన తుది జట్టులో స్థానం ఉండట్లేదు. ఏదో పంత్‌కు రెస్ట్ ఇచ్చినపుడు కొన్ని అవకాశాలిచ్చినా, కీలక మ్యాచుల్లో బెంచ్ కే పరిమవుతున్నాడు. గతేడాది అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సూర్యకుమార్ యాదవ్, ఇప్పటికే 25 టీ20లు ఆడాడంటే అర్థం చేసుకోవచ్చు. శాంసన్ కు ఎన్ని అవకాశాలిస్తున్నారా? అన్నది. డుదల చేసిన టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా అతడి పేరు లేదు. ఈ నేపథ్యంలో కేరళతో పాటు టీమిండియా అభిమానులు చాలా మంది శాంసన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. అతనికి బీసీసీఐ అన్యాయం చేస్తోందని గొంతెత్తి నినాదాలు చేశారు. దేశంలో ఏ మ్యాచ్ జరిగినా ఇలాంటి చర్యలే ఉంటాయని గట్టి హెచ్చరికలు జారీచేశారు.
“Sanju Samson is part of the ODI squad against South Africa,” says Sourav Ganguly🏏
📸: BCCI#SanjuSamson #INDvsSA #TeamIndia #CricketTwitter pic.twitter.com/HmzebVfWpr
— SportsTiger (@sportstigerapp) September 28, 2022
ఈ ప్రమాదాన్ని గమనించిన బీసీసీఐ.. సాంసన్ ను భారత-ఏ జట్టుకు సారథిగా నియమించింది. స్వదేశంలో న్యూజిలాండ్ -ఏ తో జరుగుతన్న వన్డే సిరీస్ కు అతడే సారథిగా ఉన్నాడు. ఆ సిరీస్ లో సంజూ సారథిగానే గాక బ్యాటర్ గా కూడా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా రెగ్యులర్ ఆటగాడిగా కూడా సాంసన్ ను చూస్తారని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ హింట్ ఇచ్చాడు. “అతడు (శాంసన్) కొద్దిరోజులుగా బాగా ఆడుతున్నాడు. ఇండియా తరఫున కూడా ఆడాడు. ఐపీఎల్ లో తన ఫ్రాంచైజీ తరఫున మెరుగ్గా ఆడుతున్నాడు. దురదృష్టవశాత్తూ ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. కానీ అతడు త్వరలోనే భారత జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారతాడు. దక్షిణాఫ్రికా తో జరుగబోయే వన్డే సిరీస్ లో అతడు ఆడతాడు..” అని తెలిపాడు.
sourav ganguly gives big update on sanju samson team india return.. pic.twitter.com/8w9ZLb2FIk
— Govardhan Reddy (@gova3555) September 29, 2022
కాగా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిశాక రోహిత్ సేన టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు శిఖర్ ధావన్ సారథ్యం వహించనుండగా, సంజూ శాంసన్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, తిరువనంతపురం వేదికగా జరిగిన ఇండియా- సౌతాఫ్రికా తొలి టీ20 మ్యాచ్ సజావుగా జరగడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.