SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Why Cheteshwar Pujara Playing Aggressive Cricket

Cheteshwar Pujara: ద్రవిడ్‌ నుంచి సెహ్వాగ్‌ స్టైల్‌కు మారుతున్న పుజారా! టార్గెట్‌ అదేనా..?

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Wed - 24 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Cheteshwar Pujara: ద్రవిడ్‌ నుంచి సెహ్వాగ్‌ స్టైల్‌కు మారుతున్న పుజారా! టార్గెట్‌ అదేనా..?

టీమిండియాలో ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో ది బెస్ట్‌ టెస్టు బ్యాటర్‌ ఎవరని అడిగితే అందరూ చెప్పే పేరు చతేశ్వర్‌ పుజారా. అతని బ్యాటింగ్‌ స్టైల్‌ టెస్టు క్రికెట్‌కు అంతలా సూట్‌ అవుతుంది. పుజారా టీమిండియాలోకి వచ్చిన కొత్తలో అతని బ్యాటింగ్‌ను చూసి టీమిండియాకు మరో రాహుల్‌ ద్రవిడ్‌ దొరికేశాడని, నయా వాల్‌ అంటూ పుజారాను కొనియాడారు. అందుకు తగ్గేట్లే పుజారా కూడా ఇండియన్‌ టెస్టు టీమ్‌లో కీ ప్లేయర్‌గా ఎదుగుతూ వచ్చాడు. కానీ.. ఒక్కసారిగా పుజారాలో భారీ మార్పు వచ్చింది.

రెండు మూడు నెలలుగా పుజారా ఆడుతున్న తీరు చూస్తుంటే అతన్ని టెస్టు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ అనేందుకు ధైర్యం సరిపోవడం లేదు. నిఖార్సయిన టీ20 బ్యాటర్‌లా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. సెంచరీల మీద సెంచరీలతో సరికొత్త పుజారాను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. ఫోర్లు, సిక్సులను మంచినీళ్లు తాగినంత ఈజీగా కొట్టేస్తున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌ స్టైల్‌.. పుజారా ఇలా ఆడతాడని కలలో కూడా ఎవరూ ఊహించని విధంగా ఉంది. స్వీప్‌షాట్లు, ఎక్రాస్‌ది లైన్‌ షాట్లు, ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి బౌలర్‌ నెత్తిపైనుంచి సిక్సులు అబ్బో… దాదాపు ఏబీ డివిలియర్స్‌ను దించేస్తున్నాడు.

సంప్రదాయ క్రికెట్‌కు, క్లాస్‌ షాట్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంటే పుజారా.. విధ్వంసపు క్రికెట్‌ ఆడుతున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ద్రవిడ్‌ లాంటోడు సెహ్వాగ్‌లా మారిపోయాడు. బంతి వస్తే ఎలా డిఫెన్స్‌ ఆడాలని చూస్తే స్థాయి నుంచి బంతి పూర్తిగా రాకముందే ముందుకెళ్లి మరీ దాని సిక్స్‌ కొడుతున్నాడు. ఇలాంటి మార్పు పుజారాలో ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? పుజారా ఇంత కసిగా ఎందుకు ఆడుతున్నాడనే అనుమానం అందరిలోనూ కలుగుతోంది. ద్రవిడ్‌ వారసుడిగా వచ్చిన పుజారా సెహ్వాగ్‌కు సోదరుడిలా ఎందుకు మారుతున్నాడో.. ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా టెస్టు జట్టుకు మాత్రమే పరిమితమైన పుజారాకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. అందుకు కారణం.. ప్రస్తుతం అసలు సిసలైన క్రికెట్‌కు ఉన్న ఆదరణ కంటే ఇన్స్‌టెంట్‌ క్రికెట్‌కు ఉన్న డిమాండే ఎక్కువ. ఎవరు అవునన్నా.. కాదన్నా ఇది ఒప్పుకొని తీరాల్సిన సత్యం. ఈ నేపథ్యంలో ఎంతో మంది యువ క్రికెటర్ల కన్న వంద రెట్లు టాలెంటెడ్‌ అయిన పుజారాకు కొన్ని సందర్భాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఐపీఎల్‌ లాంటి వేదికలపై పుజారా లాంటి వారికి స్థానం దక్కడం లేదు. బీసీసీఐ కాంట్రాక్ట్స్‌లోనూ పుజారా కంటే చాలా మంది యువ క్రికెటర్లు మెరుగైన స్థితిలో ఉన్నారు.

ఇలా గుర్తింపు పరంగా, ఆర్థికంగా ఎంతో నష్టపోతున్న పుజారా.. తనకు జరుగుతున్న నష్టమేంటో గుర్తించినట్లు ఉన్నాడు. అందుకే బంతిని ఎలా ఎదురుకోవాలో తెలిసిన తనకు బంతిని బలంగా ఎలా బాదాలో తెలియదా అని తనకు తాను ఆత్మ పరిశీలన చేసుకున్నట్లు తెలుస్తుంది. అందుకే ఇకపై తన పంథా మార్చుకుని.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన సత్తా చాటాలని పుజారా బలంగా ఫిక్స్‌ అయినట్లు సమాచారం. అందుకు ఇంగ్లండ్‌లో జరిగే కౌంటీ క్రికెట్‌ను వేదికగా చేసుకున్నాడు. కౌంటీల్లో సత్తా చాటి.. రాయల్‌ లండన్‌ వన్డే కప్‌లో ససెక్స్‌ టీమ్‌కు కెప్టెన్‌ అయ్యాడు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకున్న పుజారా.. కసితీరా ఆడుతున్నాడు. తన స్ట్రైక్‌రేట్‌ను అమాంతం పెంచేసుకున్నాడు.

రెండు సెంచరీలను కేవలం 79, 75 బంతుల్లోనే బాదేసి ఔరా అనిపించాడు. అలాగే 28 బంతుల్లోనే 74 పరుగులు బాదాడు. ఒకే ఓవర్‌లో 22 పరుగులు పిండుకున్నాడు. ఇలా తనను తాను ఒక టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా మార్చుకుంటున్నాడు. ఐపీఎల్‌, టీమిండియా వన్డే జట్టులో సుస్థిర స్థానం కోసమే పుజారా.. ద్రవిడ్‌ స్టైల్‌ నుంచి సెహ్వాగ్‌ స్టైల్‌కు మారినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పుజారా ఫామ్‌, స్పీడ్‌ చూస్తుంటే ఐపీఎల్‌ 2023లో అతని కోసం ఐపీఎల్‌ టీమ్స్‌ పోటీ పడేలా ఉన్నాయి. చివరి సారిగా పుజారా 2021 ఐపీఎల్‌లో చెన్నై తరపున ఆడాడు. మరి పుజారాలో వచ్చిన ఈ మార్పుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: పుజారా అంటే ఫ్లవర్‌ అనుకుంటివా? ఫైరు..! సెకండ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ

4 2 4 2 6 4

TWENTY-TWO off the 47th over from @cheteshwar1. 🔥 pic.twitter.com/jbBOKpgiTI

— Sussex Cricket (@SussexCCC) August 12, 2022

A century from just 75 balls for @cheteshwar1. 🤩 💯

Just phemeomenal. 💫 pic.twitter.com/z6vrKyqDfp

— Sussex Cricket (@SussexCCC) August 23, 2022

Tags :

  • Cheteshwar Pujara
  • Cricket News
  • IPL
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam