క్రికెట్‌పై మితిమీరిన అభిమానం ఒక వ్యక్తి హత్యకు దారితీసింది. తమ అభిమాన క్రికెటర్ గొప్పంటే కాదు మా అభిమాన ఆటగాడే గొప్ప అంటూ చోటు చేసుకున్న వాదన చిలికిచిలికి గాలివానగా మారి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని అరియలూరు జిల్లా పొయ్యూర్ గ్రామానికి చెందిన ఎస్ ధర్మరాజ్ వ్యక్తి తన స్నేహితుడు, అదే గ్రామానికే చెందిన పీ విఘ్నేష్ అనే వ్యక్తిని దారుణంగా కొట్టి హత్యచేశాడు. విఘ్నేష్ హత్యకు విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ ఇద్దరిలో ఎవరు గొప్పా అనే విషయంపై జరిగిన ఘర్షణే కారణం. ఇందులో ధర్మరాజ్ విరాట్ కోహ్లీ అభిమాని కాగా.. విఘ్నేష్ రోహిత్ శర్మ అభిమాని.
సింగపూర్‌లో ఉంటూ స్వగ్రామానికి వచ్చిన విఘ్నేష్.. తన స్నేహితుడైన ధర్మరాజ్‌తో పాటు మరికొంత మంది స్నేహితులతో కలిసి మల్లూర్ సమీపంలోని సిడ్కో ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. ఈ సమయంలోనే మద్యం కూడా సేవిస్తున్నారు. మ్యాచ్ చూస్తున్న క్రమంలో టీ20 వరల్డ్ కప్ 2022లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరిలో ఎవరూ రాణిస్తారు? ఇద్దరిలో ఎవరు బెస్ట్ ప్లేయర్ అంటూ చర్చ మొదలైంది. ఈ చర్చ కాస్త వాదనగా ఆపై ఘర్షణగా మారింది. కోహ్లీని కించపరిచేలా విఘ్నేష్ కామెంట్స్ చేయడంతో ఆగ్రహించిన ధర్మరాజ్ అతనిపై దాడికి పాల్పడ్డాడు. బాటిల్‌తో పాటు బ్యాట్ తీసుకుని తలపై బలంగా కొట్టడంతో విఘ్నేష్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
ఈ ఘటన సంచలనంగా మారింది. కాగా.. హత్య నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ వ్యక్తం అవుతుంది. కొంతమంది కోహ్లీ అభిమానులు ఈ హత్యను సమర్థిస్తున్నారంటూ రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ హత్యకు బాధ్యత వహించేలా విరాట్ కోహ్లీపై కేసు నమోదు చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అరెస్ట్ కోహ్లీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
#ArrestKohli It’s not Virat Kohli’s fault .🥺🙏 pic.twitter.com/mDbxUO9tbo
— Aman Hrithikians #VedhaArmy♥️ (@hrithik_aman) October 15, 2022
#ArrestKohli Trends after Virat Fan Murders Rohit Sharma Supporter in Tamil Nadu.https://t.co/xsOcf3jWjo
— News18 CricketNext (@cricketnext) October 15, 2022