ఇన్నింగ్స్ చివరి ఓవర్ చివరి బాల్.. ఎవరైనా లాస్ట్ బాల్‌కు వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని చూస్తారు. అందులోనూ 20 ఓవర్ల మ్యాచ్ కాస్త వర్షం పుణ్యామని 12 ఓవర్లే అయింది. ఇక ప్రతి బాల్‌ను బాదాల్సిందే. ఇక లాస్ట్ బాల్ సంగతైతే చెప్పనక్కర్లేదు. ఫుల్ అలర్ట్‌గా ఉండి.. బాల్ బ్యాట్‌కు తగలకున్నా.. సింగిల్ తీసుకుంటారు. కానీ.. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మాత్రం 12 ఓవర్ల మ్యాచ్లో చివరి ఓవర్ చివరి బంతికి షాట్ ఆడి చాలా నిర్లక్ష్యం వహించాడు. దీంతో ఊహించని రిజల్ట్ వచ్చింది. నిజానికి ఆ చివరి బంతికి స్టోక్స్ లాంగ్‌ఆన్‌లోకి అద్భుతమైన షాట్ ఆడాడు. అది కచ్చితంగా ఫోర్ పోతుందనే ధీమాతో రన్స్ కోసం ప్రయత్నించలేదు.
కానీ.. మ్యాచ్‌కు ముందు వర్షం పడటంతో మైదానం మొత్తం తడిగా ఉంది. దీంతో వేగంగా గ్రౌండ్‌పై పడ్డ బంతి ఆ తర్వాత నెమ్మదైపోయింది. దీంతో ఫీల్డర్ బంతిని బౌండరీ లైన్‌పై ఆపాడు. ఈ విషయాన్ని నాన్‌స్ట్రైకర్ ఎండ్ నుంచి గమనిస్తున్న ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్.. పరుగు కోసం వెళ్లాడు. బట్లర్ స్ట్రైకర్ ఎండ్‌కు చేరుకున్న తర్వాత షాకై పరుగు లంఘించుకున్న స్టోక్స్ పరుగుల పూర్తి చేసే క్రమంలో కాలు జారీ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో కిందపడిపోతాడు. మళ్లీ తిరిగి లేచి రెండో పరుగు కోసం ప్రయత్నించగా.. అప్పటికే బౌలర్ మ్యాక్స్‌వెల్ చేతుల్లోకి బంతి వచ్చేస్తుంది. దీంతో చేసేందేం లేక స్టోక్స్ మళ్లీ ఇన్‌టైమ్‌లో నాన్‌స్ట్రైకర్ ఎండ్ క్రీజ్‌లోకి చేరుకుంటారు.
దీంతో ఇంగ్లండ్ చివరి ఓవర్ చివరి బంతికి సింగిల్‌తో సరిపెట్టుకుంది. కానీ.. స్టోక్స్ షాట్ ఆడిన వెంటనే అలర్ట్‌గా ఉండి రన్‌కు వెళ్లుంటే ఈజీగా రెండు పరుగులు వచ్చేవి. ఈ ఘటనపై సోషల్ మీడియాలో స్టోక్స్‌పై సెటైర్లు కురుపిస్తున్నారు. ఏదో భారీ సిక్స్ కొట్టేసినట్టు ఫీలైపోయడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 12 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. కెప్టెన్ బట్లర్ 65 పరుగులతో రాణించాడు. ఇక లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 3.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. ఈ సమయంలో భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేశాడు. దీంతో ఈ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది.
Village village village 😂
A bit of everything here from Ben Stokes 🤣 pic.twitter.com/mkjwrSaCZT
— Cricket on BT Sport (@btsportcricket) October 14, 2022