మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2022 ప్రారంభం కానుంది. దీని కోసం టీమిండియా కాస్త ముందుగానే ఆసీస్ చేరుకుని లోకల్ టీమ్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇక 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడి తమ వరల్డ్ కప్ వేటను ప్రారంభించనుంది. అయితే టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంతో.. అతని స్థానంలో మరో పేసర్‌ను టీమిండియాలోకి సెలెక్టర్లు ఇంకా తీసుకోలేదు. మొహమ్మద్ షమీ లేదా మొహమ్మద్ సిరాజ్‌ను బుమ్రా స్థానంలో తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే స్పీడ్ స్టార్, జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ సైతం ఆస్ట్రేలియా వెళ్లి భారత బృందంతో కలవాల్సి ఉంది.
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వరల్డ్ కోసం ఉమ్రాన్ మాలిక్‌తో పాటు కుల్దీప్ సేన్‌ను నెట్ బౌలర్లుగా ఎంచుకున్నాడు. అక్కడి ఆస్ట్రేలియా పిచ్‌లపై బౌలింగ్ మంచి వేగంతో పాటు బౌన్సర్లు ఎక్కువగా పడతాయి. అందుకే గంటకు 150కి పైగా వేగంతో బౌలింగ్ వేసే ఉమ్రాన్ మాలిక్‌తో టీమిండియా బ్యాటర్లకు ప్రాక్టీస్ చేయించాలని ద్రవిడ్ ప్లాన్. అలాగే లెఫ్ట్ ఆర్మ్ పేసరైన కుల్దీప్ సేన్‌తో కేఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ప్రాక్టీస్ చేయించేందుకు నెట్ బౌలర్‌గా తీసుకున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌కు ఈ ముగ్గురు బ్యాటర్లు కాస్త ఇబ్బందిపడతారనే విషయం తెలిసిందే. అందుకే వరల్డ్ కప్ ఆసాంతం వీరి ముగ్గురికి కుల్దీప్‌తో బౌలింగ్ చేయించి, వారి వీక్‌నెస్‌ను తగ్గించాలని కోచ్ ద్రవిడ్ భావిస్తున్నాడు.
ఇందుకోసం ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్‌ను ఆస్ట్రేలియా రావాల్సిందిగా పిలుపు వచ్చింది. వరల్డ్ కప్ లాంటి మెగా వేదికలపై నెట్ బౌలర్లుగా వెళ్లడం ఈ యువ బౌలర్లకు మంచి అవకావమే అయినా.. ఈ ఇద్దరు ఆస్ట్రేలియా వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వీరిద్దరికి వీసా సమస్యలు తలెత్తాయి. దీంతో ఈ పాటికే ఆస్ట్రేలియా వెళ్లి నెట్స్‌లో భారత్ బ్యాటర్లకు బౌలింగ్ వేయాల్సిన ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్.. ప్రస్తుతం ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా ఇక వీరిని ఆస్ట్రేలియా పంపేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. షమీ, సిరాజ్, శార్దుల్ ఠాకూర్ ఆస్ట్రేలియా వెళ్లనున్నారు.
Umran Malik and Kuldeep Sen who were set to join India as net bowlers for the T20 World Cup, didn’t travel due to visa issues. (Reported by Cricbuzz).
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 12, 2022
It is learnt that Malik and Kuldeep Sen haven’t received their visas yet and now the Board has decided not to send them to Australia as Mohammed Shami, Mohammed Siraj and Shardul Thakur will be going instead.
✍️ @pdevendrahttps://t.co/ffSDP81Dpg
— Express Sports (@IExpressSports) October 13, 2022
ఇది కూడా చదవండి: బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఔట్.. ‘కర్మ ఫలితమే’ అంటున్న కోహ్లీ ఫాన్స్!