బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ కథ దాదాపు ముగిసినట్టే. అతని స్థానంలో 1983 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్స్ టీం సభ్యుడు రోజర్ బిన్నీ నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఖాయంగా కనిపిస్తుంది. అనధికారికంగా జరిగిన బీసీసీఐ పెద్దల భేటీలో గంగూలీని అధ్యక్ష పదవిని వదులుకోమని స్పష్టం చేసినట్లు సమాచారం. అందుకు గంగూలీ అంగీకరించలేదని వార్తలోస్తున్నప్పటికీ.. అది నిజం కాకపోవచ్చు. ఏదేమైనా మరో ఐదు రోజుల్లో ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ మాజీ కాబోతున్నది వాస్తవం. ఈ నేపథ్యంలో కోహ్లీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన నాటి నుంచి కోహ్లీ-గంగూలీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. 2021 టీ20 ప్రపంచకప్‌కు ముందు తాను పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుని మిగిలిన ఫార్మాట్లలో కెప్టెన్ గా కొనసాగాలని కోహ్లీ భావించాడు. ఈ మేరకు టోర్నీ ముగిశాక టీ20లకు గుడ్ బై చెప్పాడు. అయితే.. స్ప్లిట్ కెప్టెన్సీ (ఫార్మాట్ కు ఒకరుచొప్పున) సరైన నిర్ణయం కాదని.. ఈ విషయంలో కోహ్లీని తాము వారించామని అయినా వినకుండా అతడు టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఈ విషయం అప్పట్లో పెద్ద వివాదానికి దారి తీసింది.
🇮🇳 ❤️ pic.twitter.com/Ds7okjhj9J
— Virat Kohli (@imVkohli) September 16, 2021
ఈ వ్యాఖ్యలపై కోహ్లీ ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లేముందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘బీసీసీఐ నుంచి నన్నెవరూ సంప్రదించలేదు.. అది నా సొంత నిర్ణయం’ అని చెప్పుకొచ్చాడు. అంటే.. వారించామని గంగూలీ చెప్పిన మాటల్లో వాస్తవంలేదని.. దాదా అబద్దాలు చెబుతున్నట్టు అతడిని బోనులో నిలబెట్టాడు. ఆపై కొద్దిరోజులకే బీసీసీఐ.. కోహ్లీని వన్డే సారథిగా కూడా తప్పించి టెస్టులకు మాత్రమే పరిమితం చేసింది. ఇక దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ముగిశాక కోహ్లీ టెస్టు కెప్టెన్సీ కూడా నుంచి తప్పుకున్నాడు.
“I think #ViratKohli has made a decision to quit at the time of his choosing,” says Prakash Wakankar (@pakwakankar), Sports Broadcaster, as Virat Kohli steps down as Test Captain of India. pic.twitter.com/juBs83oAyp
— NDTV (@ndtv) January 15, 2022
ఇలా అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకోవడం, తప్పించడం వెనుక బీసీసీఐ హస్తముందని అతడి అభిమానులు వాపోయారు. కోహ్లీ వందో టెస్టు (శ్రీలంకతో మొహాలీలో) సందర్భంగా కూడా అతడిని సరైన గౌరవం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ పెద్దగా పట్టించుకోలేదు. దీన్ని మనుసులో పెట్టుకున్న కోహ్లీ అభిమానులు.. ‘ఇప్పుడు దాదా బీసీసీఐ నుంచి వెళ్తుండటంతో.. దీన్ని పాత విషయాలకు ముడిపెడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. “కర్మ ఫలాన్ని అందరూ అనుభవించాల్సిందేనని.. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరని” భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినదానికంటే వివరంగా చెబుతూ దాదాకు కౌంటర్లు ఇస్తున్నారు.
According to Reports
• No backing to Sourav Ganguly from BCCI to continue his 2nd term as the BCCI President.
• Jay Shah to continue as the secretary of BCCI.
• Sourav Ganguly denied the offer to become the IPL chairman.
• Roger Binny likely to be the next main man for BCCI. pic.twitter.com/XtWOxCfMHJ— 𝙶𝙰𝚄𝚃𝙰𝙼. (@ProudGautam) October 12, 2022
This man went on saying “Board will look into it” on Virat Kohli’s statement in press and now himself getting it all back. What goes around comes around. https://t.co/Rrz3MXcO4H
— She (@ffspari) October 11, 2022