టీ20 వరల్డ్ కప్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈక్రమంలో టీమిండియా జట్టులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జట్టులో ఒక్కో బౌలర్ గాయాల కారణంగా మెగా టోర్నీకి దూరం అవుతూ.. వస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఎంపిక చేసిన జట్టు ఒకటైతే.. మరో జట్టు ప్రపంచ కప్ ఆడేలా ఉందే! అంటూ నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీమిండియా టీ20 స్కాడ్ సెలక్షన్ పై ఆసిస్ స్పీడ్ స్టార్ బ్రెట్ లీ మండిపడ్డాడు. ఈ క్రమంలోనే టీమిండియా నయా బౌలింగ్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ ను ఎందుకు సెలక్ట్ చేయలేదంటూ.. సెలక్టర్లను ప్రశ్నించాడు. అదీ కాక ఉమ్రాన్ మాలిక్ ను స్పోర్ట్స్ కారుతో పోల్చుతూ.. సెలక్టర్లపై సెటైర్ వేశాడు.
“మీ దగ్గర ఓ మంచి స్పోర్ట్స్ కారుంది. మీరు దాన్ని మీ గ్యారేజ్ లో వదిలేసి వస్తే.. మీకు ఆ కారుండి ఏం లాభం” అని ఉమ్రాన్ మాలిక్ ను ప్రశంసిస్తూ.. టీమిండియా సెలక్షన్ కమిటీపై వ్యంగ్యాస్త్రాలు విసిరాడు బ్రెట్ లీ. ఉమ్రాన్ గురించి మరింతగా మాట్లాడుతూ..”ఆస్ట్రేలియా పిచ్ లు స్పీడ్ కు, బౌన్సీకి అనుకులిస్తాయని ప్రపంచ మెుత్తానికి తెలుసు. మరి 150 కి.మి స్పీడ్ తో బంతులు విసిరే ఉమ్రాన్ మాలిక్ ను సెలక్టర్లు ఎందుకు దృష్టిలో పెట్టుకోలేదో నాకైతే అర్థం కావట్లేదు. ఆస్ట్రేలియా పిచ్ లపై అతడి స్పీడ్, పేస్, స్వింగ్ అద్భుతంగా పనికొస్తుంది. టీమిండియా మాలిక్ ను జట్టులోకి తీసుకుని ఉండాల్సింది” అంటూ పేర్కొన్నాడు. ఉమ్రాన్ మాలిక్ ను చూడగానే నాకు వకార్ యూనిస్ గుర్తకు వస్తున్నాడు. ఉమ్రాన్ మాలిక్ కు నేను కూడా అభిమానినే అని బ్రెట్ లీ గతంలో ఓ సారి అన్నాడు.
ఇక బూమ్రా గాయం పై స్పందిస్తూ..”బూమ్రా గాయం భారత్ టీ20 గెలవడంపై గ్యారంటీగా ప్రభావం చూపుతుంది. పైగా అతడు జట్టులో లేకపోవడంతో మిగతా బౌలర్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్ పై ఇది ఎక్కువగా ఉంటుంది. బూమ్రా స్థానంలో మాలిక్ ను తీసుకుని ఉండాల్సింది. టీమిండియా జట్టు కూర్పును బట్టి చూస్తే వారు సెలక్షన్ టైమ్ లో డైలమాలో పడ్డట్లు అనిపిస్తోందని” బ్రెట్ లీ అన్నాడు. అయితే అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఎక్కువ అనుభవం లేని కారణంగానే మాలిక్ ను సెలక్టర్లు పక్కన పెట్టారని తెలుస్తోంది. ఇక ఉమ్రాన్ కేవలం 3 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడి 2 వికెట్లు తీసుకున్నాడు. కానీ ఆస్ట్రేలియా పిచ్ లు సీమ్ కు అనుకులిస్తాయి కాబట్టే బ్రెట్ లీ ఈ విధంగా కామెంట్స్ చేశాడని క్రీడానిపుణులు భావిస్తున్నారు.
Brett Lee feels Umran Malik should have been included in India’s T20 WC squad.#T20WorldCup2022 | #India | @BrettLee_58 pic.twitter.com/D429EGWq8Z
— CricTracker (@Cricketracker) October 12, 2022