ప్రపంచ క్రికెట్‌లో ఎంతో మంది గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. భారీ రికార్డులు నెలకొల్పిన వాళ్లు.. ఆ రికార్డులను బద్దలు కొట్టిన క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. కానీ.. ప్రస్తుతం క్రికెటర్లలో టాప్ 5 క్రికెటర్లు వీళ్లే అంటూ ఆస్ట్రేలియా స్టార్ క్రికెరట్ స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. చాలా మంది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఇలాంటి ప్రకటనలు చేస్తారు. కానీ.. స్మిత్ మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతూనే.. తన సమకాలీన క్రికెటర్లలో టాప్ ఆటగాళ్లు వీళ్లే అంటూ ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా కూడా చేసి స్మిత్.. ఆ తర్వాత పూర్ ఫామ్‌తో ఇబ్బంది పడ్డాడు. స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక అవుతాడా? లేదా? అనే సందేహాలు కూడా వ్యక్తం అయ్యాయి.
అయితే.. వరల్డ్ కప్‌కు ఎంపికైనా స్మిత్‌కు మ్యాచ్ ఆడే అవకాశాలు పెద్దగా రాలేదు. అదే విధంగా ఆస్ట్రేలియా జట్టు సెమీస్‌కు కూడా క్వాలిఫై కాకుండా విఫలమైంది. ఈ ఓటమి నుంచి తేరుకున్న తర్వాత.. స్మిత్ ఈ సంచలన ప్రకటన చేశాడు. కాగా.. స్మిత్ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రస్తుతం క్రికెటర్లలో నంబర్ వన్ క్రికెటర్‌గా పేర్కొన్నాడు. అలాగే కోహ్లీ తర్వాత వరుసగా జో రూట్, ప్యాట్ కమిన్స్, కగిసో రబడా, రవీంద్ర జడేజాలను టాప్ క్రికెటర్లగా ఎన్నుకున్నాడు. కాగా.. చాలా మంది మాజీ క్రికెటర్లు.. విరాట్ కోహ్లీ, జో రూట్, స్టీవ్ స్మిత్‌లను పోల్చుతూ ఉంటారు. కానీ.. తన టాప్ ఆటగాళ్ల లిస్ట్‌లో తన పేరును ప్రస్తావించలేదు.
ఇటివల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 82 పరుగులతో చెలరేగి ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌లతో మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ హాఫ్ సెంచరీలతో రాణించాడు. ఇక కీలకమైన సెమీస్‌లోనూ హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ మొత్తం 296 పరుగులతో టోర్నీకి టాపర్ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ సైతం కోహ్లీని ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా పేర్కొన్నాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు వరించినా.. తన వరకు కోహ్లీనే ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అని పాంటింగ్ ప్రకటించాడు.
Steve Smith picks top 5 players in the world currently:
1) Virat Kohli
2) Joe Root
3) Pat Cummins
4) Kagiso Rabada
5) Ravindra Jadeja(Source – Fox Cricket)
— Johns. (@CricCrazyJohns) November 15, 2022