ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా నేడు(గురువారం) కీలక మ్యాచ్ ఆడబోతుంది. అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌లో తలపడనుంది. సూపర్ 12లో 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో గ్రూప్ బీ టాపర్‌గా భారత్ సెమీస్ చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి సెమీస్‌లో పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఓడించి.. పాకిస్థాన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పుడు టీమిండియా.. ఇంగ్లండ్‌ను ఓడించి.. ఫైనల్లో పాక్‌పై గెలిచి కప్ కొట్టాలని పట్టుదలతో ఉంది. ఇదే జరగాలని ఇంగ్లండ్ తప్పా.. క్రికెట్ ప్రపంచం మొత్తం కోరుకుంటుంది. అలాగే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా బలబలాలను పరిశీలించినా.. భారత్ హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తుంది.
టీమిండియాలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వారికి తోడు కేఎల్ రాహుల్ కూడా ఫామ్‌లోకి రావడం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇక టీమిండియా కెప్టెన్, హిట్ మ్యాన్, మ్యాచ్ విన్నర్ రోహిత్ శర్మ కూడా పరుగులు చేస్తే.. ఇంగ్లండ్‌ను ఓడించడం భారత్‌కు పెద్ద విషయం కాదు. కానీ.. రోహిత్ ఈ టోర్నీలో పెద్దగా రాణించలేదు. సూపర్ 12లో నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన రోహిత్.. ఆ తర్వాత మళ్లీ మూడు మ్యాచ్‌ల్లోనూ విఫలం అయ్యాడు. అయితే.. సెమీస్, ఫైనల్స్ లాంటి బిగ్ మ్యాచ్‌లలో తన బెస్ట్ ఆటను బయటికి తీసుకొచ్చే రోహిత్.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లోనూ అదరగొడతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
అలాగే టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సైతం రోహిత్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని హెచ్చరిస్తున్నాడు. రోహిత్ శర్మ ఫుల్ షాట్‌ను ఎంతో అద్భుతంగా ఆడతాడని.. ఫుల్ షాట్‌ను రోహిత్ ఆడినట్లు ప్రపంచంలో మరే ఆటగాడు కూడా కొట్టలేడని కోహ్లీ బల్లగుద్ది చెప్తున్నాడు. కాగా.. రోహిత్ శర్మ ఫేవరేట్ షాట్లలో ఫుల్ షాట్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ఆ షాట్‌తో రోహిత్ కొన్ని పరుగులు కూడా చేశాడు. అదే రోహిత్ ప్రధాన బలం. కానీ.. ఈ మధ్య కాలంలో ఆ ఫుల్ షాటే రోహిత్ బలహీనతగా మారుతోంది. ఆస్ట్రేలియా లాంటి పెద్ద గ్రౌండ్‌లు ఉండే దేశంలో వరల్డ్ కప్ జరుగుతుండటంతో రోహిత్‌ను అవుట్ చేసేందుకు షార్ట్ పిచ్ బంతులను సంధిస్తూ.. రోహిత్ ఫేవరేట్ ఫుల్ ఆడించే అతన్ని అవుట్ చేస్తున్నారు. మరి ఈ వీక్‌నెస్‌ను సెమీస్‌లో రోహిత్ ఎలా అధిగమిస్తాడో చూడాలి.