ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా దూసుకెళ్తోంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో గ్రూప్ బీ టేబుల్ టాపర్‌గా నిలిచింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన టీమిండియా.. ఆ తర్వాత నెదర్లాండ్స్‌ను మట్టికరిపించింది. సౌతాఫ్రికా చేతిలో ఫీల్డింగ్ తప్పిదాలతో ఓడినా.. బంగ్లాదేశ్‌పై కీలక విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌కు సెమీస్ బెర్త్ దాదాపు ఖరారైనట్లే.. ఇక జింబాబ్వేతో మిగిలిన ఆ ఒక్క మ్యాచ్ గెలిచేస్తే.. అధికారికంగా టీమిండియా సెమీస్ చేరుతుంది. అయితే ఒక పక్క టీమిండియా ప్రదర్శన బాగున్నా.. మరోపక్క టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ మాత్రం కలవరపెడుతోంది. ఈ వరల్డ్ కప్‌లో రోహిత్ నెదర్లాండ్స్‌పై మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు.
పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 4, సౌతాఫ్రికాపై 15, బంగ్లాదేశ్‌పై 2 పరుగులు మాత్రమే చేశాడు. ఈ టోర్నీలో రోహిత్ ఆడిన 4 మ్యాచ్‌ల్లో అతను చేసిన మొత్తం పరుగులు 74 మాత్రమే. ఇది రోహిత్ శర్మ బ్యాడ్ ఫామ్‌లో ఉన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయితే రోహిత్ శర్మ పూర్ ఫామ్ టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉండడంతో కొంత సమస్య తగ్గినా.. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఒక్క మ్యాచ్‌లో కూడా సరైన స్టార్ట్ లభించలేదు. రోహిత్ శర్మ నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో 53 పరుగులతో రాణించినా.. కేఎల్ రాహుల్ విఫలం అయ్యాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కేఎల్ హాఫ్ సెంచరీ చేస్తే.. రోహిత్ విఫలం అయ్యాడు. పాకిస్థాన్, సౌతాఫ్రికా లాంటి టీమ్స్‌పై ఇద్దరూ విఫలం అయ్యారు. దీంతో ఒక్క మ్యాచ్‌లో కూడా టీమిండియాకు పవర్‌ప్లేలో భారీగా పరుగులు రాలేదు.
విరాట్ కోహ్లీ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తున్నా.. ఓపెనర్‌గానే కనిపిస్తున్నాడు. ఒకటి లేదా రెండో ఓవర్‌లోనే ఓపెనర్లలో ఒకరు అవుట్ అవ్వడంతో కోహ్లీపై కూడా ఒత్తిడి ఉంటోంది. కాగా.. కేఎల్ రాహుల్ స్లో బ్యాటింగ్ అప్రోచ్‌తోనే రోహిత్ శర్మపై ఒత్తిడి పెరుగుతుందనే వాదన కూడా ఉంది. పవర్ ప్లేలో పరుగులు చేయడానికి రాహుల్ ఇబ్బంది పడుతుండటంతో వేగంగా రన్స్ చేయాలనే ఉద్దేశంతో రోహిత్ టూ అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేస్తూ.. వికెట్ పారేసుకుంటున్నాడని కొంతమంది క్రికెట్ నిపుణులు అంటున్నారు. అయితే.. రోహిత్ శర్మ వైఫల్యానికి దానికంటే కూడా తన బ్యాడ్ షాట్ సెలక‌్షనే ప్రధాన కారణం అని మరికొంతమంది క్రికెట్ పండితులు అంటున్నారు. చెత్త షాట్లతో రోహిత్ శర్మ అవుట్ అవుతున్నాడని.. షాట్ ఎంపిక సరిగా ఉంటే రోహిత్ ఫామ్ అందుకోవడం పెద్ద విషయం కాదని అభిప్రాయపడుతున్నారు. అయితే రోహిత్ పూర్ ఫామ్ ఇలాగే కొనసాగితే.. రానున్న మ్యాచ్‌లో టీమిండియాకు ఇబ్బందులు తప్పవని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు.
Rohit sharma and kl rahul both are good opener. Today they opened gate for Pakistan out of the world Cup.#INDvsSA #RohitSharma𓃵 pic.twitter.com/eRHB7gCmSu
— ADÎTI💫💖 (@ADTI07) October 30, 2022