”శత్రువుకు శత్రువు.. మనకు మిత్రువు” అన్న చాణక్య నీతిని కరెక్ట్ గా ఫాలో అవుతున్నట్లుంది పాక్. వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో టీమిండియా చేతిలో ఓడిపోయిన పాక్.. తాజాగా బంగ్లాదేశ్ తో చేతులు కలిపి భారత్ పై విమర్శలు గుప్పిస్తోంది. ఇటు బంగ్లాదేశ్ సైతం టీమిండియా తొండి చేసి గెలిచిందని మాట్లాడుతోంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ.. దానికి పెనాల్టీ కింద 5 రన్స్ మాకు ఇవ్వాల్సిందని బంగ్లాదేశ్ ప్లేయర్ నురుల్ హసన్ బాహటంగానే వ్యాఖ్యానించాడు. అదీ కాక అంపైర్లు సైతం భారత్ కు అనుకూలంగా వ్యవహరించారంటూ బంగ్లా, పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా టీమిండియా పై నిందలు వేస్తున్నారు. కోహ్లీ చెప్పినట్లుగానే పాక్, బంగ్లాదేశ్ మ్యాచ్ ల్లో అంపైర్లు వ్యవహరించారంటూ ఇరుదేశాల ఫ్యాన్స్ భారత్ పై నిందలు మోపుతున్నారు.
టీ20 వరల్డ్ కప్ లో బుధవారం జరిగిన భారత్ – బంగ్లా మ్యాచ్.. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ను తలపించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్ లో టీమిండియా 5 పరుగులతో బంగ్లాపై విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్ చుట్టూ కొంత కొంత వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఆ వివాదాల కారణంగా టీమిండియాపై బంగ్లా, పాక్ ఫ్యాన్స్ నిందలు వేస్తున్నారు. భారత్ చీటింగ్ చేసి గెలిచిందని వారు అంటున్నారు. భారత్ పై వారు నిందలు వేయడానికి ప్రధాన కారణం.. విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్. అక్షర్ పటేల్ వేసిన 6వ ఓవరల్లో బంగ్లా బ్యాటర్ లిట్టన్ దాస్ కొట్టిన బంతిని అర్షదీప్ సింగ్ పట్టుకుని వికెట్ కీపర్ డీకే కి బంతిని విసిరాడు. వారిద్దరి మధ్య ఉన్న కోహ్లీ బంతిని పట్టుకుని త్రో వేసినట్లు ఫేక్ ఫీల్డింగ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Fake Fielding?😲😲#T20WorldCup #INDvBAN #ViratKohli𓃵 pic.twitter.com/fv3xcRHzPi
— RVCJ Media (@RVCJ_FB) November 3, 2022
అయితే క్రికెట్ నింబంధన ఆర్టికల్ 41.5.1 ప్రకారం ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్దం. దాంతో బంగ్లాకి 5 పరుగులు ఇవ్వాల్సిందని బంగ్లా ప్లేయర్ నురుల్ హసన్ అన్నాడు. అయితే అంపైర్లు దానిని సరిగ్గా గమనించకపోవడం బాధకరం అని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. అదీ కాక ఈ మ్యాచ్ లో కోహ్లీ వైడ్ అని చెప్పగానే అంపైర్లు కూడా విరాట్ చెప్పినట్లే వింటున్నారని కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ కింద బంగ్లాకు 5 పరుగులు ఇచ్చి ఉంటే గెలిచేవాళ్లం అని బంగ్లా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. బంగ్లాదేశ్ అభిమానుల కంటే పాక్ క్రికెటర్లు, పాక్ ఫ్యాన్సే భారత్ గెలిచినందుకు ఫీల్ అవుతున్నారు. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లుగా.. గెలిచిన టీమ్ పై ఓడిపోయి టీమ్ కు సహజంగానే కోపం ఉంటుందని, ఆ కారణంగానే ఇరు దేశాల ఫ్యాన్స్ టీమిండియాపై నిందలు వేస్తున్నారని భారత అభిమానులు రీ కౌంటర్లు వేస్తున్నారు.
#FakeFielding or not ???#Askthepavilion #PakVSa #NoBall pic.twitter.com/1Z25J8WVDV
— Muhammad Shehroz 🇵🇰 (@Iam_Shehroz) November 2, 2022