క్రికెట్ భావోద్వేగాలతో కూడకున్న ఆట. ఇందులో ఫోర్లు, సిక్సులతో పాటు బాధ, సంతోషాలు ఒక రేంజ్‌లో ఉంటాయి. కొన్నిసార్లు ఎమోషన్ కట్టలు తెంచ్చుకొని కన్నీళ్ల రూపంలో బయటి తన్నుకొచ్చేస్తోంది. ఆరు అడుగుల ఆజానుభాహులైనా, ప్రపంచ స్థాయి ఆటగాడైనా.. క్రికెట్ ఆడించే భావోద్వేగాల ఆటకు తలొగ్గాల్సిందే. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లోనూ తాజాగా ఇలాంటి ఒక సంఘటనే చోటు చేసుకుంది. 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. 35 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సులతో 55 పరుగులు చేసిన ఆటగాడు.. మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్‌లోనే వెక్కివెక్కి ఏడ్చాడు. అంత మంచి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కూడా ఆ ఆటగాడు ఎందుకు కన్నీటి పర్యంతమయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం..
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం నమీబియా, యూఏఈ జట్లు తలపడ్డాయి. ఇప్పటికే నమీబియా శ్రీలంక లాంటి పెద్ద టీమ్‌ను తొలి మ్యాచ్‌లోనే ఓడించి.. అంతులేని ఆత్మవిశ్వాసంతో ఉంది. మరోవైపు నెథర్లాండ్స్, శ్రీలంక చేతుల్లో ఓడిన యూఏఈ.. ఒక్క విజయం కోసం ఎదురుచూస్తోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 148 పరుగులు నామమాత్రపు స్కోర్ చేసింది. యూఏఈ బ్యాటర్లలో ఓపెనర్ మొహమ్మద్ వసీమ్ 50, రిజ్వాన్ 43 పరుగులుతో రాణించారు. చివరల్లో బాసిల్ హమీద్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 25 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. దీంతో యూఏఈ నమీబియా ముందు 149 పరుగుల టార్గెట్ ఉంచగలిగింది. శ్రీలంక లాంటి టీమ్‌నే చిత్తుచిత్తుగా ఓడించిన నమీబియాకు ఈ టార్గెట్ చాలా ఈజీ అనిపించింది.
కానీ.. ఆ జట్టు టాపార్డర్ కుప్పకూలింది. వచ్చిన వారు వచ్చినట్లే.. కొన్ని పరుగులు చేయడం పెవిలియన్ చేరడం జరిగిపోయింది. 12.4 ఓవర్లు ముగిసే సరికి జట్టు 69 పరుగులు మాత్రమే.. కానీ అప్పటికే 7 వికెట్లు కోల్పోయి ఇక మ్యాచ్‌పై ఆశలు వదులుకున్నారు. కానీ.. ఈ టైమ్‌లో క్రీజ్‌లోకి వచ్చిన.. డేవిడ్ వైస్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు బ్యాటర్లకు బుద్ధివచ్చేలా.. అద్భుతమైన షాట్లతో రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సులతో స్టేడియాన్ని హోరెత్తించాడు. వైస్ చెలరేగి ఆడుతుంటే.. యూఏఈ బౌలర్లు చేతులెత్తేసినట్లు కనిపించారు.
కానీ.. 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో మరుపురాని ఇన్నింగ్స్ ఆడిన వైస్.. చివరి ఓవర్ 4వ బంతికి బౌండరీ లైన్ వద్ద అలీషాన్ సూపర్ క్యాచ్‌కు అవుటైయ్యాడు. అప్పటి జట్టు స్కోర్ 139.. విజయానికి ఇంకా 10 పరుగులు కావాలి. కానీ.. 20 ఓవర్ల ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేసి నమీబియా 7 పరుగులతో ఓటమి పాలై.. వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ వైస్.. తన జట్టును గెలిపించలేకపోయేనే అనే బాధతో డగౌట్‌లో వెక్కివెక్కి ఏడ్చాడు. అతన్ని మిగతా టీమ్ సభ్యులు ఓదార్చారు. డేవిడ్ వైస్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ ఓడినా.. నువ్వు ఛాంపియన్ ఇన్నింగ్స్ ఆడావ్ వైస్ అంటూ నెటిజన్లు వైస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Believe me, passion for sports is worth more than winning or losing@David_Wiese love ❤️ 😍 #ZongStandsByPakistan pic.twitter.com/kC7W40bHLv
— Shilmani (@Basital75025083) October 20, 2022
So close yet so far for David Wiese 💔
📸: Disney + Hotstar pic.twitter.com/vDZWKOTKgM
— CricTracker (@Cricketracker) October 20, 2022