రాయల్ ఫ్యామిలీ.. కోట్లకు పడగెత్తిన రాజ వంశం. అయినా కూడా తాతల కాలం నుంచి క్రికెట్ అంటే చెప్పలేనంత పిచ్చి. అదే పిచ్చి ప్రేమతో క్రికెట్‌ను కెరీర్‌గా మల్చుకున్నాడు రాజ కుటుంబ వారసుడు అజయ్ జడేజా. గుజరాత్‌లో పుట్టిపెరిగిన అజయ్ జడేజా పూర్తి పేరు.. అజయ్‌సింహ్‌జీ దౌలత్‌సింహ్‌జీ జడేజా. గుజరాత్‌లోని నవనగర్ అనే రాజ్యాన్ని ఏలిన రాజ వంశానికి చెందిన వాడు. దేశవాళీ టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి.. టీమిండియాకు ఎంపికయ్యాడు. అనతి కాలంలోనే స్టార్ ప్లేయర్‌గా ఎదిగాడు. క్రికెట్‌ను ప్రేమించే అమ్మాయిలకు అతనే కలల రాకుమారుడు. జట్టులో కెప్టెన్ అజహరుద్దీన్ తర్వాత అతనే కాబోయే కెప్టెన్.
కానీ.. కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌కు దూరమయ్యాడు. కొన్నేళ్ల తర్వాత కోర్టులో కేసు వేసి.. తన నిజాయితీని చాటుకుని కడిగిన ముత్యంలా మ్యాచ్ ఫిక్సింగ్ కేసు నుంచి బయపడ్డాడు. కానీ ఏం లాభం, బంగారం లాంటి క్రికెట్ కెరీర్ సర్వనాశనం అయిపోయింది. ఏమాత్రం బాధ్యత లేకుండా.. సరైన ఆధారాలు సేకరించకుండా.. ఆరోపణలు రావడంతోనే ఒక మంచి ప్లేయర్‌పై ఐదేళ్ల పాటు నిషేధం విధించి.. అతను మళ్లీ కేసు వేస్తే.. ఫిక్సింగ్‌లో అతని పాత్ర లేదని చెప్పి చేతులు దులుపుకున్నారు. కానీ.. నష్టపోయింది మాత్రం అజయ్ జడేజా. రాజ కుంటుబం నుంచి వచ్చి, కోట్ల కొద్ది ఆస్థులున్న జడేజా.. తన ఐశ్వర్యానికి చిల్లర లాంటి లక్షల కోసం మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఉంటాడా? లేదా.. అజయ్ జడేజాపై కుట్ర జరిగిందా? ఇలా ఎన్నో ప్రశ్నలు అతని అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్‌ను తొలిచేస్తున్నాయి. అసలు ఇంతకి ఏం జరిగి ఉంటుంది? అజయ్ జడేజా జీవితం, కెరీర్ గురించి పూర్తి వివరాలు మీ కోసం..
రాజ కుటుంబం..
అజయ్ జడేజా.. 1971 ఫిబ్రవరి 1న గుజారత్‌లోని జామ్‌నగర్‌లో జన్మించాడు. అజయ్ జడేజాది రాజ కుటుంబం. రాజా రంజీత్‌సింహ్‌జీ జడేజా, రాజా దులీప్‌సింహ్‌జీ జడేజా ఆయన వంశస్థులే. నవనగర్‌కు రాజుగా ఉన్న రాజా రంజీత్‌సింహ్‌జీ జడేజా స్వాతంత్రానికి పూర్వమే బ్రిటిష్ వారితో కలిసి క్రికెట్ ఆడేవారు. అలాగే ఆయన సోదరుడైన రాజా దులీప్‌సింహ్‌జీ జాడేజా కూడా ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడారు. అప్పట్లో హాకీనే భారత్‌లో ప్రధాన క్రీడ. కానీ.. వీరిద్దరే మనదేశంలో క్రికెట్‌ను వ్యాప్తి చేశారు. అందుకే.. రాజా రంజీత్‌సింహ్‌జీ జడేజా పేరు మీద రంజీ ట్రోఫీ, రాజా దులీప్ సింహ్‌జీ జడేజా పేరుపై దులీప్ ట్రోఫీ ప్రతిఏడాది నిర్విహిస్తారు. వీరి వంశానికి చెందిన అజయ్ జడేజా తండ్రి దౌలత్‌సింహ్‌జీ జడేజా.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గుజారత్‌లోని జామ్ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే అజయ్ జడేజా బాబాయ్ ఛత్రపాల్‌సింహ్‌జీ కూడా ఫస్ట్‌క్లాస్ క్రికెటర్.
పాక్‌పై మరుపురాని ఇన్నింగ్స్..
ఇలాంటి విశిష్ట చరిత్ర కలిగిన వంశం నుంచి వచ్చిన జడేజా కూడా క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి.. 1992 ఫిబ్రవరి 28న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి టీమిండియాలో మంచి ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 1996 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అజయ్ జడేజా విశ్వరూపం చూపించాడు. తన బౌలింగ్‌తో నిప్పులు చెరిగే పాకిస్థాన్ టాప్‌క్లాస్ దిగ్గజ బౌలర్ వకార్ యూనుస్‌ను పిచ్చికొట్టుడు కొట్టాడు. ఆ మ్యాచ్‌లో తన పవర్ హిట్టింగ్‌తో కేవలం 25 బంతుల్లోనే 45 పరుగులు చేసిన జడేజా.. అద్భుత బ్యాటింగ్‌తో మరుపురాని విజయాన్ని అందించి.. భారత్‌ను ఒంటిచేత్తో వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఈ ఇన్నింగ్స్‌తో అజయ్ జడేజా పేరు ప్రపంచ క్రికెట్‌లో మారుమోగిపోయింది.
అద్భుతమైన ఆటతో పాటు ఆడపిల్లల మనసు దోచుకునే అందం అజయ్ జడేజా సొంతం. జట్టు మొత్తంలో మోస్ట్ హ్యాండ్స్‌మ్ క్రికెటర్‌గా జడేజా పేరు వినిపించేంది. క్రికెట్‌ను పిచ్చిగా ప్రేమించే కుర్రకారు ఇళ్లలో జడేజా పోస్టర్లు దర్శనమిచ్చేవి. ఇక అమ్మాయిలకైతే అజయ్ జడేజా ఒక క్రష్.. కలల రాకుమారుడు. ఇలా స్టార్ డమ్‌తో పాటు పబ్లిక్‌లోనూ అజయ్ జడేజాకు విపరీతమైన క్రేజ్ ఉండేది. మరో విధ్వంసకర ఆటగాడు రాబిన్ సింగ్‌తో కలిసి అజయ్ జడేజా ఆడిన ఇన్నింగ్స్‌లు ఇప్పటికీ అభిమానుల గుండెల్లో గూడుకట్టుకుని చెక్కుచెదరకుండా ఉన్నాయి. పైగా టీమిండియాకు అజయ్ జడేజా వైస్ కెప్టెన్. అజహరుద్దీన్ తర్వాత.. టీమిండియాకు కాబోయే కెప్టెన్‌గా జడేజా పేరు వినిపించేంది. దానికి అతను కూడా సమర్థుడే. అప్పటికే అజహర్ లేని సమయంలో టీమిండియాను 13 మ్యాచ్‌ల్లో విజయవంతంగా నడిపించాడు.
కెరీర్ ముగింపు..
ఇలా కెరీర్ అద్భుతంగా సాగిపోతున్న తరుణంలో.. ఇండియన్ క్రికెట్‌లో భారీ కుదుపు. మ్యాచ్ ఫిక్సింగ్ భూతం ఇండియన్ క్రికెట్‌ను కబళించిన సమయం అది. టీమిండియా కెప్టెన్ అజహరుద్దీన్‌తోపాటు అజయ్ జడేజా కూడా ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆరోపణలు రావడమే ఆలస్యం, బీసీసీఐ.. అజయ్ జడేజాపై ఐదేళ్ల నిషేధం విధించింది. కానీ.. 2003లో ఢిల్లీ హైకోర్టులో తనపై వచ్చిన ఆరోపణలపై బీసీసీఐకి వ్యతిరేకంగా కేసు వేసి.. ఫిక్సింగ్‌లో తన ప్రేమేయం లేదని నిరూపించుకున్నాడు. కానీ.. ఏం లాభం అప్పటికే జడేజాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన గోల్డెన్ కెరీర్ నాశనమైపోయింది. ఈ ఫిక్సింగ్ ఆరోపణలు లేకుంటే.. ఇండియన్ క్రికెట్‌లో సచిన్ స్థాయిలో జడేజా పేరు నిలిచిపోయేది. కానీ.. బీసీసీఐ తీసుకున్న తొందరపాటు నిర్ణయం అజయ్ జడేజా కెరీర్‌ను చిదిమేశాయని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక తన కెరీర్‌లో.. మొత్తం 196 వన్డేలు ఆడిన అజయ్ జడేజా 5359 పరగులు సాధించాడు. అందులో 6 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 15 టెస్టుల్లో 576 పరుగులు చేశాడు. అందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.