సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో సూర్యకుమార్ ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పిచ్ బౌలింగ్‌కు స్వర్గధామంలా మారింది. దీంతో బ్యాటర్లు పరుగులు చేసేందుకు వణికిపోయారు. టీ20ల్లో ఎప్పుడూ బ్యాటర్ల చేతిలో బౌలర్లు తమ టైమ్ వచ్చిందంటూ పిచ్ ఇస్తున్న సహకారంతో రెచ్చిపోయారు. సౌతాఫ్రికా బ్యాటర్లతో పాటు టీమిండియా కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ కేఎల్ రాహుల్‌ది ఇదే పరిస్థితి కానీ.. అతనొక్కడు మాత్రం వేరే పిచ్‌పై బ్యాటింగ్ చేస్తున్నట్లు ఆడాడు. వచ్చి రావడంతో రెండు సిక్స్‌లతో తాను కొట్టేందుకే వచ్చానని ఇది తప్ప తనకు ఇంకేం తెలియదన్నట్లు సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
107 పరుగుల స్వల్ప టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టీమిండియా టాపార్డర్ తడబడిన చోట.. రోహిత్ శర్మ 0, విరాట్ కోహ్లీ 3 పరుగులు చేసి చేతులెత్తేసిన చోట తన సత్తా ఏంటో చూపించాడు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు 3 సిక్సులతో 50 పరుగులు చేసి టీమిండియాకు విజయం అందించాడు. సూర్య రాకకు ముందు పరుగులు చేయడానికి నానాతంటాలు పడ్డ కేఎల్ రాహుల్ కూడా కొంత ధైర్యం తెంచుకుని పరుగులు పిండుకున్నాడు. సౌతాఫ్రికా ఆడిన ఈ ఇన్నింగ్స్‌తో సూర్యకుమార్ ఒక అదుదైన రికార్డు సాధించడంతో పాటు మరో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో 2022లో 732 పరుగులు సాధించాడు. భారత్ నుంచి ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఇన్ని పరుగులు చేసిన ఆటగాడు మరొకరు లేరు.
ఇక సిక్సర్ల విషయంలో సూర్య భాయ్ ఏకంగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. 2022లో అత్యధిక సిక్సులతో నంబర్ ప్లేయర్‌గా ఉన్నాడు. ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది టీ20ల్లో ఏకంగా 45 సిక్సులు బాదాడు. ఇదే ఇప్పుడు ప్రపంచ రికార్డు. 2021లో పాకిస్థాన్ వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ కొట్టిన 42 సిక్సులే ఇప్పటి వరకు రికార్డుగా ఉన్నాయి. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఆ రికార్డును బద్దలు కొట్టి 45 సిక్సులతో కొత్త చరిత్రను లిఖించాడు. టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన టాప్ 10 ఆటగాళ్లలో టీమిండియా నుంచి ఒకే ఒక్క ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. పైగా అతనే నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.
The Best T20I Player !
Surya Kumar Yadav !#SuryakumarYadav#Sky#INDvsSA#KLRahulpic.twitter.com/kPoZNb1nvT— Mufaddal Vohra (@ImRohanSharma45) September 28, 2022
Most T20I Runs In 2022!#suryakumaryadav #MohammadRizwan pic.twitter.com/ctAC7AAOQW
— Rizwan ullah (@NabeelK94045087) September 29, 2022
Most 6s in a Calendar Year in T20I
45 – Suryakumar in 2022*
42 – Rizwan in 2021
41 – Guptill in 2021#SuryakumarYadav#INDvSA— Trendy Cricket (@Trendy_Cricket) September 28, 2022
ఇది కూడా చదవండి: సౌతాఫ్రికాపై గెలిచినా.. చెత్త రికార్డును మూటగట్టుకున్న టీమిండియా!