14 ఏళ్ల నిరీక్షణ.. సెమీ ఫైనల్లో ఒక్క పరుగుతో దక్కిన విజయం.. బలమైన ప్రత్యర్థిని ఇంటికి పంపి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన ఆనందంలో శ్రీలంక క్రికెటర్లు అదిరపోయే డాన్స్‌తో దుమ్ములేపారు. ఉమెన్స్ ఆసియా కప్ 2022లో శ్రీలంక-పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో శ్రీలంక ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ఫైనల్లో టీమిండియాతో ఆసియా కప్ టైటిల్ కోసం పోటీ పడనుంది. కాగా.. సెమీ ఫైనల్‌లో పాక్‌తో మ్యాచ్‌లో విజయం సాధించడంతో పట్టలేని ఆనందంతో లంక క్రికెటర్లు గ్రూప్ డాన్స్ చేశారు. ప్రస్తుతం వారి డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్‌లో డాన్సింగ్ సెలెబ్రేషన్స్ సాధారణమే అయినా.. వీరి గ్రూప్ డాన్స్ మాత్రం చాలా స్పెషల్‌గా ఉంది. ప్రొఫెషనల్ డాన్సర్లు వేసినట్లు మంచి లయతో ఆడి పాడారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 122 పరుగుల స్వల్ప స్కోర్ సాధించింది. లక్ష్యఛేదనకు దిగిన పాక్.. 123 పరుగులు లక్ష్యానికి కేవలం రెండు పరుగులు దూరంలో నిలిచిపోయింది. 121 పరుగుల వద్ద ఓవర్లు ముగిసిపోవడంతో.. ఒక్క పరుగు తేడాతో లంక ఫైనల్ చేరింది. చివరి ఓవర్‌లో పాక్ విజయానికి 9 పరుగులు అవసరం కాగా.. శ్రీలంక బౌలర్ కులసూర్య సూపర్ బౌలింగ్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి.. 14 ఏళ్ల తర్వాత ఆసియా కప్ ఫైనల్‌కు చేరింది. ఇక ఫైనల్లో టీమిండియాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది.
కాగా.. ఇటివల ముగిసిన పురుషుల ఆసియా కప్ 2022లోనూ శ్రీలంక జట్టు అదరగొట్టింది. ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఇప్పుడు మహిళల జట్టు కూడా ఫైనల్‌కు చేరింది. మరి ఫైనల్లోనూ విజయం సాధిస్తే.. రెండు జట్లు ఒకే ఏడాది ఆసియా కప్ సాధించిన రికార్డు వారి సొంతమవుతుంది. పైగా.. తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు ఈ విజయాలు ఎంతో ఊరటను ఇస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తీవ్ర ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడుతున్న శ్రీలంకకు.. క్రికెట్ విజయాలు ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నాయి.
#ApeKello celebrating in style 💃
Sri Lanka qualified for the finals of the Women’s #AsiaCup2022 after winning against Pakistan by 1 run. pic.twitter.com/WXHkGcQJdd
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) October 13, 2022