ఇండియన్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్రసింగ్ ధోని ముందు వరుసలో ఉంటాడు. తన కెప్టెన్సీ వ్యూహ్యాలతో టీమిండియా ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. 2007లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్, 2011లో మన దేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లను టీమిండియా ధోని సారథ్యంలోనే గెలిచింది. ఇలా భారత్‌కు రెండో వరల్డ్ కప్‌లు అందించిన కెప్టెన్ ధోని చరిత్రలో నిలిచిపోయాడు. మ్యాచ్ ఏ పరిస్థితుల్లో ఉన్నా, నరాలు తెగే ఉత్కంఠ మధ్య మ్యాచ్ సాగుతున్నా.. ధోని మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉంటూ అనేక మ్యాచ్‌లను గెలిపించాడు. అందుకే అతన్ని అంతా కెప్టెన్ కూల్ అంటుంటారు. వికెట్ కీపర్ కమ్ లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా జట్టులోకి వచ్చిన ధోని.. ఆ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా ఎదిగి అద్భుతాలు చేశాడు. టీమిండియాను విశ్వవిజేతను చేశాడు.
జట్టులో తనకు తిరుగులేని సమయంలోనే కెప్టెన్సీ గుడ్‌బై చెప్పి.. ఆ బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పగించి, ఒక మామూలు ఆటగాడిలానే జట్టులో కొనసాగాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లోనూ ధోని కెప్టెన్సీ సూపర్ హిట్టే. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఇప్పటి వరకు ఏకంగా నాలుగు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపాడు. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అన్ని జట్లకు కెప్టెన్లు మారినా.. మొదటి నుంచి చెన్నై కెప్టెన్‌గా ఉన్నది ధోనినే. గత ఐపీఎల్ ప్రారంభానికి ముందు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని.. జడేజాకు అవకాశం ఇచ్చినా.. జట్టు ప్రదర్శన దారుణంగా ఉండటం, జడేజా గాయంతో ఆటకు దూరం కావడంతో మళ్లీ ధోని చేతికే పగ్గాలు వెతుక్కుంటూ వచ్చాయి.
ఇలా అంతర్జాతీయ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో కూడా తిరుగులేకుండా కెరీర్‌ను కొనసాగించిన ధోని.. వ్యాపార రంగంలోనూ దూసుకెళ్తున్నాడు. క్రికెట్ అకాడమీలు స్థాపించాడు. సినిమా రంగంలో ధోని ఎంటర్మైంట్స్ ప్రొడక్షన్ కంపెనీతో సినిమాలు నిర్మించనున్నాడు. అలాగే ధోని గ్లోబల్ స్కూల్స్ పేరిట స్కూల్స్ కూడా ప్రారంభిస్తున్నాడు. ఇలా తన జీవితంలో ఏది పట్టుకున్నా.. అద్భుతాలు చేసే ధోనిని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది రోల్ మోడల్‌గా తీసుకుంటారు. ధోనిలా ఆడాలని, ధోనిలా ఆలోచించాలని, ధోనిలా గెలవాలని, ధోనిలా ఎదగాలని.. ఎంతో మంది కలలు కంటుంటారు. మరీ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ధోని.. తన రోల్ మోడల్ ఎవరో తొలి సారి బయటపెట్టాడు. క్రికెట్‌లో చాలా మందిలాగే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కరే తన రోల్ మోడల్ అని అన్నాడు ధోని. స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా పిల్లలతో ముచ్చటించిన ధోని.. మీ రోల్ మోడల్ ఎవరని అడిగిన ప్రశ్నకు.. మీ అందరి లాగే సచిన్ నా రోల్ మోడల్. అతని ఆట చూసే పెరిగాను, సచిన్‌లానే ఆడాలనుకున్నాను. కానీ ఆడలేకపోయాను అని నవ్వుతూ బదులిచ్చాడు. కాగా.. ధోనికి టీమిండియా కెప్టెన్సీ దక్కడం వెనుక సచిన్ ఉన్న విషయం తెలిసిందే. సచిన్ సలహాతోనే సీనియర్ యువరాజ్‌ను కాదని ధోనికి టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు.
An idol for all @sachin_rt ♥️🙌🫶pic.twitter.com/kNdG06UH4B
— 100MB (@100MasterBlastr) October 13, 2022
Sachin Tendulkar and MS Dhoni together doing an Ad shoot. pic.twitter.com/1DcKTQsgGu
— Johns. (@CricCrazyJohns) October 6, 2022
MS Dhoni and Sachin Tendulkar both Scored duck In their ODI debut and both reached to 7000 ODI runs in same no. Of innings (189) . pic.twitter.com/wo2vG7MAmT
— MAHIYANK™ (@Mahiyank_78) October 13, 2022
Biggest heroes of India’s 2011 World Cup
Yuvraj: 362 runs & 15 wkts , 77 runs in Knockouts & 6 wkts
Sachin : 482 runs , 156 runs in Knockouts
Gambhir : 393 runs , 174 runs in Knockouts
Zaheer : 21 wkts , 6 wkts in KOs
Sehwag,Dhoni,Bhajji ,Raina,Kohli,Munaf,also chipped in pic.twitter.com/ijVSuRFeVp
— Abhinandan (@Abhinandan6638) April 2, 2022
Thread :
( Sachin Tendulkar + Ms Dhoni) pictures from 2011 World Cup.Guess the matches?
And comment@sachin_rt | @msdhoni | #SachinTendulkar | #MSDhoni pic.twitter.com/wkQUU43WCR
— 𝑨𝒌𝒖𝒍 𝑻𝒉𝒂𝒌𝒖𝒓 (@Loyalsachfan01) January 7, 2022
Don’t cry its just a game…
The game on 2nd April 2011 in Wankhede, Mumbai –
Thank you Sachin Tendulkar, Gambhir, Yuvi, MS Dhoni, Raina, Zaheer Khan, Bhajji and entire Indian Cricket team for moments of lifetime for billion!#WorldCup2011 #YuvrajSingh pic.twitter.com/h3M9Uq04Wq— Vishal Verma (@VishalVerma_9) April 2, 2021