ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్‌ను పక్కనపెట్టి, ఫామ్‌లో ఉండి తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన గిల్‌ను ఎట్టకేలకు రోహిత్ శర్మ తుది జట్టులోకి తీసుకున్నాడు. కానీ.. గిల్ మ్యాచ్ ఆరంభంలోనే గాయపడ్డాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఇండోర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. ఇప్పటికే తొలి రెండు టెస్టులను గెలిచిన టీమిండియా ఆసీస్‌ను వైట్‌వాష్ చేయడంపై దృష్టిపెట్టింది. మరోవైపు ఆస్ట్రేలియా మిగిలిన రెండు టెస్టుల్లోనైనా గెలిచిన సిరీస్‌ను సమం చేయడంతో పాటు పరువు నిలుపుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో బుధవారం మొదలైన మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించాడు. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌ను పక్కనపెట్టడంతో శుబ్‌మన్ గిల్, రోహిత్‌కు జోడీగా ఇన్నింగ్స్ ఆరంభించాడు.
ఇద్దరూ మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించినా.. కుహ్నేమాన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ అనవసరపు షాట్‌కు ఫ్రంట్‌కు వచ్చి స్టంప్ అవుట్ అయ్యాడు. స్పిన్‌కు పూర్తిగా బీటైన రోహిత్.. తన వికెట్‌ను కీపర్ చేతుల్లో పెట్టాడు. ఇక అన్ని ఫార్మాట్లలో మంచి ఫామ్‌లో ఉన్న గిల్.. ఈ మ్యాచ్‌లోనూ మూడు ఫోర్లతో మంచి టచ్‌లో కనిపించాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్ రెండు బంతిని మిడ్ ఆన్ దిశగా పుష్ చేసిన గిల్.. క్విక్ సింగిల్ కోపం పరిగెత్తాడు. తానే డేంజర్ ఎండ్‌లో ఉండటంతో ఫుల్‌లెంగ్త్ డైవ్ కొట్టాడు. దీంతో.. గిల్ కడుపుపై చిన్న గాయమైంది. అయినా కూడా గిల్ బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ.. దురదృష్టవశాత్తు కొద్ది సేపటికే అవుట్ అయ్యాడు. 18 బంతుల్లో 3 ఫోర్లతో 21 రన్స్ చేసి అవుట్ అయ్యాడు.
ఇక గిల్ అవుటైన తర్వాత టీమిండియా వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 34 పరుగుల వద్ద గిల్ అవుట్ అవ్వగా.. 36 రన్స్ వద్ద పుజారా కేవలం ఒక్క రన్‌చేసి లయన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కొద్ది సేపటికే 44 పరుగుల వద్ద జడేజా 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 45 రన్స్ వద్ద శ్రేయస్ అయ్యర్ డకౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా 45కే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజ్‌లో విరాట్ కోహ్లీ 19, కేఎస్ భరత్ 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 18 ఓవర్ల తర్వాత భారత్ 5 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. మరి ఈ మ్యాచ్‌లో గిల్ డెడికేషన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
రెండో వికెట్ కోల్పోయిన భారత్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023: ఆసీస్‌తో ఇండోర్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 34 పరుగుల వద్ద 2వ వికెట్ కోల్పోయింది. శుబ్‌మన్ గిల్ 21 రన్స్ చేసి అవుట్ అయ్యాడు.#BGT2023 #INDvAUS #ShubmanGill #SumanTV
— SumanTV (@SumanTvOfficial) March 1, 2023