భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజామ్.. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మేన్ అనే విషయంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఐసీసీ రివ్యూలో భాగంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ వైడ్ టాప్ 5 బెస్ట్ టెస్ట్ క్రికెటర్స్ ఎవరు అంటే.. ముందు పేరు విరాట్ కోహ్లీ పేరు చెప్పడం విశేషం. విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్, స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్, జో రూట్‌లను టాప్ 5 ఉత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా ఎంచుకున్నారు. టెస్టు క్రికెట్ విషయంలో.. నెంబర్ వన్ ఎవరు అని తనను అడిగితే తాను ఎప్పుడూ విరాట్ కోహ్లీ పేరే చెబుతానని, ఆ స్టాండర్డ్స్‌ని మెయిన్‌టెయిన్ చేసే సత్తా కోహ్లీకి ఉందని చెప్పుకొచ్చారు. అన్ని ఫార్మాట్లలోనూ అదే సత్తా కొనసాగిస్తూ వస్తున్నారని, భారత్ తరపున ఆడిన ప్రతిసారీ అతనిలో ఆ ఇంటెన్షన్ కనిపిస్తుందని అన్నారు. అందుకే టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ బెస్ట్ బ్యాట్స్‌మేన్ అని వాట్సన్ పేర్కొన్నారు.
ఇక పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ గురించి మాట్లాడుతూ.. బాబర్ బాగా ఆడతాడని, అయితే తన ఆటను టెస్ట్ క్రికెట్‌కు తగ్గట్టు ఎలా మలచుకుంటాడో చూడాలని, అందుకే అతనికి టెస్ట్ ఫార్మాట్‌లో రెండవ స్థానాన్ని ఇస్తున్నానని అన్నారు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వన్డేలు, టీ20 ఫార్మాట్లలో నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్న బాబర్.. టెస్టుల్లో మాత్రం మూడో స్థానంలో ఉన్నారు. మూడు ఫార్మాట్లలో టాప్ 3లో నిలిచిన ఏకైక బ్యాట్స్‌మేన్ మాత్రం బాబర్ అజామ్‌నే. అయినప్పటికీ బాబర్‌ని కాదని, విరాట్ కోహ్లీనే నెంబర్ వన్ టెస్ట్ ప్లేయర్‌గా ఎంచుకున్నారు వాట్సన్. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 102 టెస్టులు ఆడి 8,074 పరుగులు చేయగా.. బాబర్ 42 టెస్టులు ఆడి 3,122 పరుగులు చేశారు. బాబర్ అజామ్ ఆటతీరుని చూసిన ఫ్యాన్స్ అజామ్‌ను విరాట్ కోహ్లీతో పోల్చుతున్నారు. అయితే టాప్ టెస్ట్ ప్లేయర్‌గా బాబర్ అజామ్ కంటే కూడా విరాట్ కోహ్లీనే బెస్ట్ అని షేన్ వాట్సన్ అనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి షేన్ వాట్సన్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
In ICC rankings, Babar Azam is the No. 1 batter in ODIs and T20Is while he is No. 3 in Tests but Shane Watson has picked Virat Kohli as the best Test batter#BabarAzam #ViratKohli #ICCRankingshttps://t.co/bIcfsMLQTx
— CricketNDTV (@CricketNDTV) August 21, 2022