బాబర్ అజామ్-మహమ్మద్ రిజ్వాన్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోన్న పేర్లు. దానికి కారణం తాజాగా వారు నెలకొల్పిన రికార్డే. ఈ జోడి అంతర్జాతీయ టీ20ల్లో వికెట్ నష్టపోకుండా ఇంగ్లాండ్ పై 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో పాక్ ఓపెనర్లపై సొంత జట్టు ఆటగాళ్లతో పాటు ఇతర దేశ ఆటగాళ్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఆటగాడైన షాహిన్ షా అఫ్రిది ట్వీటర్ వేదికగా బాబర్-రిజ్వాన్ లపై వ్యంగ్యస్త్రాలు విసిరాడు. ప్రస్తుతం అతడు పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..
బాబర్ అజామ్.. గత కొంత కాలంగా ఫామ్ లేమితో సతమతమవుతూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పాక్ ఆసియా కప్ ఫైనల్ చేరినప్పటికీ అందులో బాబర్ పాత్ర శూన్యం. కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వడంతోనే బాబర్ కు దురదృష్టం అంటుకుందని అప్పట్లో ట్రోల్స్ సైతం వచ్చాయి. ఈ క్రమంలోనే టీ20 ర్యాంకింగ్స్ ల్లో సైతం బాబర్ దిగజారాడు. ప్రస్తుతం అతడు 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఈ విమర్శలన్నింటికి తాజాగా తన సెంచరీతో సమాధానం చెప్పాడు. ఇక మరో ఓపెనర్ రిజ్వాన్ తన మునపటి ఫామ్ ను కొనసాగిస్తూ.. 88 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలోనే ఈ జోడీపై పాక్ బౌలర్ షాహిన్ అఫ్రిది తనదైన శైలిలో స్పందించాడు. వికెట్ నష్టపోకుండా 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంపై చమత్కారంగా రాసుకొచ్చాడు.
ఈ క్రమంలోనే షాహిన్ అఫ్రిది ట్వీటర్ లో ఈ విధంగా రాసుకొచ్చాడు.”నా ఆలోచన ప్రకారం వీరిని అంటే బాబర్ అజామ్-రిజ్వాన్ లను జట్టు నుంచి వదిలించుకునే సమయం వచ్చిందని నా అభిప్రాయం. అయితే వారు చాలా బాగా ఆడారు. కానీ నా అభిప్రాయంలో ఈ మ్యాచ్ ను 15 ఓవర్లలోనే ముగించాల్సింది. కానీ మీరు 20 ఓవర్లదాకా తీసుకొచ్చారు.. ఇది సరైంది కాదు. అయినప్పటికీ పాకిస్థాన్ జట్టు అద్భుతంగా ఆడింది. బాబర్-రిజ్వాన్ లు మీరు నిజంగా స్వార్థపరులు. మిగతా వారికి బ్యాటింగ్ రాకుండా చేశారు” అంటూ సరదాగా రాసుకొచ్చాడు. మ్యాచ్ లు గెలిచినప్పుడు ఇతర క్రీడాకారులు తమదైన శైలిలో ఈ విధంగా స్పందించడం మనం చాలానే చూశాం. ఇలా సరదాగా స్పందించడంలో టీమిండియా డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎప్పుడూ ముందుంటాడు అనే విషయం మనకు తెలిసిందే. మరి షాహిన్ అఫ్రిది బాబర్-రిజ్వాన్ లపై చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
I think it is time to get rid of Kaptaan @babarazam258 and @iMRizwanPak. Itne selfish players. Agar sahi se khelte to match 15 overs me finish hojana chahye tha. Ye akhri over tak le gaye. Let’s make this a movement. Nahi? 😉
Absolutely proud of this amazing Pakistani team. 👏 pic.twitter.com/Q9aKqo3iDm
— Shaheen Shah Afridi (@iShaheenAfridi) September 22, 2022