రేపటి నుంచి ఆస్ట్రేలియా వేదికగా పొట్టి ప్రపంచ కప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. కాగా.. టీమిండియా ఈ నెల 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో వరల్డ్ కప్ వేటను ఆరంభించనుంది. కానీ అంతకంటే ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో ఒక్కో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. కాని యావత్ క్రికెట్ అభిమానుల దృష్టి మాత్రం భారత్-పాక్ మ్యాచ్‌పైనే ఉంది. ఈ దాయాదుల పోరుకు ఉండే క్రేజ్ అలాంటి. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతలా ఎదురుచూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడం.. కేవలం ఐసీసీ మెగా ఈవెంట్స్‌లోనే పోటీ పడుతుండటంతో ఆ క్రేజ్ మరింత ఎక్కువైంది.
ఇక ఈ టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ.. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలపై తనకు అంతగా నమ్మకం లేదని అందుకోసమే పాకిస్థాన్‌తో మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక చేసినట్లే వెల్లడించాడు. ఆ విషయం ఆటగాళ్లకు కూడా చెప్పినట్లు పేర్కొన్నాడు. ఆసియా కప్‌లో మా యువ క్రికెటర్లు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడారు. దీంతో వారిపై ఈ మ్యాచ్ ఒత్తిడి లేదు. భారత్-పాక్ మ్యాచ్ అంటే ఉండే ఉత్కంఠ గురించి తనకు తెలుసని.. అందుకే పాక్‌తో ఎవరు ఆడబోతున్నారో ఆటగాళ్లుకు ముందే చెప్పడం ద్వారా వారు కూడా కొంత రిలాక్స్ అయి ఒత్తిడికి దూరంగా ఉంటారని, వారి వద్ద అంత సమయం ఉంటుందని రోహిత్ పేర్కొన్నాడు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఎలాంటి గేమ్ ప్లాన్‌తో వస్తామనే విషయం ఇప్పుడే చెప్పడం సరికాదని, ఆస్ట్రేలియా పిచ్‌లపై 140-150 పరుగులు సరిపోవని, ఆ స్కోర్‌ను 14-15 ఓవర్లలోనే కొట్టేసే సామర్థ్యం అన్ని జట్లు మెరుగుపర్చుకున్నట్లు రోహిత్ అభిప్రాయపడ్డాడు. ఇక బుమ్రా స్థానంలోకి మొహమ్మద్ షమీ జట్టులోకి రావడం సంతోషంగా ఉందని అన్నాడు. షమీ ఇంకా జట్టుతో చేరకపోయినా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరిగే వార్మప్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని, అతను ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడాలని రోహిత్ తెలిపాడు. కాగా.. ఇప్పటికే వెస్టర్న్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడిన టీమిండియా తొలి మ్యాచ్‌లో గెలిచి, రెండో మ్యాచ్‌లో ఓడింది. కానీ.. బ్యాటర్లకు, బౌలర్లకు మంచి ప్రాక్టీస లభించింది. ఇక పాక్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్‌సింగ్, హర్షల్ పటేల్‌లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
Rohit Sharma vs Babar Azam on October 23rd in the T20 World Cup. pic.twitter.com/MhKUg8o4BE
— Johns. (@CricCrazyJohns) October 15, 2022