ఎప్పుడూ గంభీరంగా , డిస్వార్డ్‌గా ఉండే రోహిత్ శర్మ హోళీ సందర్భంగా మాత్రం చిన్నపిల్లాడిలా మారిపోయి.. చాలా ఉత్సాహంగా పండుగ సంబురాలను జరుపుకున్నాడు. ఈ వేడుకల్లో రోహిత్ చేసిన ఒక పనిపై మాత్రం విమర్శలు వస్తున్నాయి.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. డ్యూటీలో ఉన్న పోలీసులతో రోహిత్ శర్మ వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత సంతోషంలో ఉన్నా.. ఎదుటి వ్యక్తులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో కాస్త గుర్తెరిగి వ్యవహరించాలంటూ హితవు పలుకుతున్నారు. అయితే.. చేసిన తప్పు పెద్దదేం కాకపోయినా.. సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ రోహిత్ ఏం చేశాడంటే.. దేశవ్యాప్తంగా బుధవారం హోళీ సంబురాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లు సైతం హోళీ వేడుకలను జరుపుకున్నారు. ఆటగాళ్లు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోళీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎప్పుడూ చాలా గంభీరంగా ఉండే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ హోళీ వేడుకల్లో మాత్రం చాలా ఉత్సాహంగా పాల్గొన్నాడు.
జట్టులోని ఆటగాళ్లందరికీ రంగులు ముందు తనే పూస్తూ.. పండుగ వాతావరణం నింపేశాడు. కెప్టెనే ఈ స్థాయిలో చెలరేగిపోతుంటే.. మిగిలిన ఆటగాళ్లు సైతం రంగులు పూసుకుంటూ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాలుగో టెస్టు కోసం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి బస్సులో బయలుదేరే ముందే హోటల్ రూమ్‌లో ఆటగాళ్లంతా హోళీ ఆడారు. హోటల్‌లో దొరికి ఆటగాళ్లందరకీ రంగులు పూసిన రోహిత్.. బస్సులో దొరికిన విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లను కూడా వదలకుండా రంగులు పూసాడు. ఈ క్రమంలో హోటల్ నుంచి బస్సు ఎక్కేందుకు బయటికి వచ్చిన రోహిత్ శర్మ.. బయట సెక్యూరిటీగా ఉన్న పోలీసులపై కూడా రంగులు వేశాడు. వాళ్లు కూడా రోహిత్ ఉత్సాహాన్ని కాదనలేక నవ్వుతూ నిలబడ్డారు. కానీ.. రోహిత్ చేసింది కరెక్ట్ కాదంటూ నెటిజన్లు అంటున్నారు. డ్యూటీలో ఉన్న పోలీసులపై రోహిత్ రంగులు వేయడం సరికాదని, పండుగ సందర్భంగా నలుగురితో సంతోషం పంచుకోవడం తప్పుకాదు కానీ, డ్యూటీలో అందులోనూ యూనిఫామ్‌లో ఉన్న పోలీసులపై అనుమతి లేకుండా అలా రంగులు వేయడం సరికాదని అంటున్నారు.
టీమిండియా కెప్టెన్, పెద్ద స్టార్ కావడంతో పోలీసులు కూడా ఏం అనలేకపోయారు కానీ, అదే ఒక సామాన్యుడు డ్యూటీలో ఉన్న పోలీసులపై అలా రంగులు వేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అప్పటి వరకు హోళీ ఆడిన రోహిత్ తన రూమ్‌కు వెళ్లి ఫ్రెష్ అవుతాడని, కానీ అక్కడ సెక్యురిటీగా ఉన్న పోలీసులు ఎప్పటివరకు డ్యూటీలో ఉంటారో అనే విషయం రోహిత్ గమనించి ఉండాలని అంటున్నారు. అందుకే బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో సైతం పోలీసులపై రంగులు వేసిన దృశ్యాలను కట్ చేసి.. కేవలం షేక్‌హ్యాండ్ ఇస్తున్న దృశ్యాలను మాత్రమే ఉంచారు. కానీ, అక్కడున్న వాళ్లు తీసిన పూర్తి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. రోహిత్ సంతోషంలోనే అలా చేసి ఉంటాడు తప్ప.. దాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, పోలీసులు సైతం సంతోషంగా రోహిత్ రంగులు వేడయంతో మురిసిపోయారంటూ మరికొంతమంది నెటిజన్లు పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Colours, smiles & more! 🥳 ☺️
Do not miss #TeamIndia’s Holi celebration in Ahmedabad 🎨 pic.twitter.com/jOAKsxayBA
— BCCI (@BCCI) March 8, 2023
Endhanna thaaginava @ImRo45 ?? 😭😭 pic.twitter.com/NMYvbSd4fM
— Vikas (@Jilebi45) March 8, 2023