టీమిండియా కెప్టెన్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్, ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ.. అయితే అతను ఏ స్థాయికి వచ్చేందుకు ఎంతలా కష్టపడ్డాడో అతని స్నేహితుడు, టీమిండియా మాజీ క్రికెటర్ వివరించాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరఫున ఎన్ని గొప్ప రికార్డులు సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్ రోహిత్ శర్మనే. టీమిండియా తరఫునే కాకుండా.. ఐపీఎల్‌లో కూడా అద్భుత రికార్డులు సృష్టించాడు. తొలుత మన హైదరాబాద్ టీమ్ డెక్కన్ ఛార్జర్స్‌కు ఆడిన రోహిత్ శర్మ.. 2009లో ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన జట్టులో సభ్యుడు కూడా. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌కు మారిన రోహిత్.. కెప్టెన్‌గా ఆ జట్టును ఏకంగా ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. ఐపీఎల్‌లో అందరి కంటే కూడా అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా, ఆటగాడిగా అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ గెలిచి రికార్డు పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు. ఇప్పుడు మరో సారి ఐపీఎల్ టైటిల్ వేటకు కోసం బరిలోకి దిగనున్నాడు.
మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 31న ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. దీంతో దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి మొదలైపోయింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడంటూ అతని స్నేహితుడు, టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఓజా మాట్లాడుతూ.. ‘నేను, రోహిత్ శర్మ కలిసి ఆరంభంలో డెక్కన్ ఛార్జర్స్‌కు ఆడాం, ముంబై ఇండియన్స్ కూడా ఆడాం. అయితే అతనితో స్నేహం మొదలైంది మాత్రం.. అండర్ 15 క్రికెట్ ఆడుతున్న సమయంలో.. ఆ సమయంలో ఒక టోర్నీలో రోహిత్‌ను నేను అవుట్ చేశా.. అతను చాలా స్పెషల్ ప్లేయర్ అంటూ అందరూ చెప్పుకునే వారు.
రోహిత్ ఎవరితోనూ పెద్దగా మాట్లాడే వాడు కాదు. కానీ గ్రౌండ్‌లో చాలా అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేసేవాడు. నా బౌలింగ్‌లోనూ అంతే అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేసేవాడు. నా బౌలింగ్‌లో మరీ అంత అగ్రెసివ్‌గా ఎందుకు ఆడేవాడో నాకు అర్థం అయ్యేది కాదు. కానీ.. తర్వాత అతనితో స్నేహానికి అదే కారణం అయింది. మా ఇద్దరి మధ్య ఒకనొక సందర్భంలో రోహిత్ మాట్లాడుతూ.. తన క్రికెట్ కిట్ కోసం ఇంటింటికీ వెళ్లి పాలు పోసేవాడ్ని అని రోహిత్ తనతో చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు. రోహిత్ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చాడు. క్రికెట్ కిట్ కొనేందుకు అతను పాలు పోసేవాడు. అంత కష్టపడ్డాడు కనుకే అతను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు. రోహిత్‌ను ఈ స్థాయిలో చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది.’ అంటూ ఓజా పాత జ్ఞాపకాలను పంచుకున్నాడు. ముంబైకి చెందిన రోహిత్ శర్మ.. తన అద్భుత టాలెంట్ ఈ రోజు భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎదిగాడు. నిజానికి రోహిత్‌కు ఈ స్థానం ఎప్పుడో దక్కాల్సింది. కానీ కాస్త ఆలస్యంగా వచ్చింది. మరి రోహిత్ ఎమోషనల్ జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Pragyan Ojha said “Rohit Sharma was from a middle class family, he delivered milk packets to buy the kits. I feel proud & emotional about his journey”.
— Johns. (@CricCrazyJohns) March 28, 2023