ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. శుక్రవారం మ్యాచ్ ప్రారంభమైన తొలి రోజు టీమిండియా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న స్థితి నుంచి మూడో రోజు మ్యాచ్‌ను శాసించే స్థాయికి వచ్చిందంటే దానికి ప్రధాన కారణం రిషభ్ పంత్ అని చెప్పాలి. అప్పటి వరకు ఆధిపత్యం చెలాయిస్తున్న ఇంగ్లండ్‌కు తన ఎటాకింగ్ ప్లేతో ధీటుగా జవాబిచ్చాడు. జడేజాతో కలిసి ఏకంగా 222 పరుగుల భాగస్వామ్యం నిర్మించి భారత్‌కు భారీ స్కోర్ అందించాడు.
పంత్ క్రీజ్‌లోకి వచ్చిన సమయానికి భారత్ కనీసం 150 పరుగులైనా చేస్తుందా అనిపించింది. కానీ.. పంత్ 111 బంతుల్లోనే 20 ఫోర్లు, 4 సిక్సులతో 146 పరుగులు చేసి టీమిండియాను ఆదుకున్నాడు. పంత్ ఆడిన ఈ ఇన్నింగ్స్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా పంత్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. టెస్టు మ్యాచ్‌లో ఒత్తిడి సమయంలో ఇలాంటి పదర్శన ఎంతో ప్రత్యేకం అని.. రిషభ్ పంత్, జడేజా అద్భుతంగా ఆడారంటూ ప్రశంసించాడు. ప్రపంచ క్రికెట్‌లో దిగ్గజ క్రికెటర్, ఇండియన్ క్రికెట్ గతిని మార్చిన గంగూలీ లాంటి వ్యక్తి నుంచి పొందిన ప్రశంస పంత్‌కు ఎంతో ప్రత్యేకం. అందుకే పంత్ కూడా గంగూలీ ట్వీట్‌కు ‘థ్యాంక్యూ దాదా’ అంటూ రిప్లేయ్ ఇచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని ప్రస్తుతం భారత్ 257 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక నాలుగో రోజు టీమిండియా మరో 150 పైచిలుకు పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నాలుగో రోజు చివర్లో డిక్లేర్ చేసి.. ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌కు ఆహ్వానిస్తే ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా 3-1తో భారత్ సొంతం అవుతుంది. టీమిండియాను ఈ స్థితిలో నిలబెట్టిన పంత్ బ్యాటింగ్‌పై, అందుకు గంగూలీ ప్రశంసపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Thank you dada 🙏 https://t.co/1Rr3WS35QH
— Rishabh Pant (@RishabhPant17) July 2, 2022
Special exhibition of test match batting under pressure .@RishabhPant17 @imjadeja ..can’t get better then this ..get to 375 tmrw ..
— Sourav Ganguly (@SGanguly99) July 1, 2022