రవిచంద్రన్ అశ్విన్.. తాజాగా తన 37వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. దాంతో అతడికి రాజకీయ, సినీ, క్రీడా సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షాలు వెళ్లువెత్తాయి. అయితే ఆసియాక కప్ లో అతడికి పెద్దగా ఆడే అవకాశం రాలేదు. అయినప్పటికీ అశ్విన్ ను త్వరలో ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 ప్రపంచ కప్ కు ఎంపిక చేశారు. అయితే తాజాగా అశ్విన్ పుట్టిన రోజు సందర్భంగా అతని భార్య ప్రీతీ నారాయణ్ ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ప్రీతీ స్వతహాగానే చాలా సరదా మనిషి గతంలో కూడా చాలా ట్వీట్స్ ఫన్నీగా చేసి వార్తల్లో నిలిచారు. ఇప్పుడైతే ఏకంగా తమ ఫస్ట్ నైట్ ఎలా జరిగిందో చెప్పి అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రీతీ నారాయణ్.. రవిచంద్రన్ అశ్విన్ భార్యగా ఆమె అందరికి సుపరిచితురాలే. అయితే ప్రీతీ మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. తన భావాలకు చమత్కారాలను జోడించి చెప్పడంలో ప్రీతీ సిద్దహస్తురాలు. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత జరిగిన తమ శోభనాన్ని క్రికెట్ మ్యాచ్ తో పోలుస్తూ.. చమత్కారంగా వివరించింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సందర్భం వచ్చిన ప్రతీసారి ఆమె తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే మరో సారి వార్తల్లో నిలిచింది. తమ శోభనం గురించి ఆమె మాట్లాడుతూ..”మా శోభనం తర్వాతి రోజే అశ్విన్ కు మ్యాచ్ ఉంది. దాంతో నేను ఆయనని నిద్రపోనివ్వండి అని మా కుటుంబ సభ్యులకు చెప్పాను. కానీ వారు నా మాట వినకుండా చాలా గడియారాల్లో అలారం పెట్టి ఆయన నిద్రను పాడు చేశారు.
దీంతో మ్యాచ్ అనంతరం మేం శోభనం మ్యాచ్ ఆడాం.. అది నాకు మెుదటి టెస్ట్ మ్యాచ్.. దాంతో నాకు కొద్దిగా భయం.. కంగారు.. కలిగాయి. కానీ అప్పటికే ఆశ్విన్ మైదానంలోనే ఉన్న సంగతిని నేను మర్చిపోయా! అతనికి అప్పటికే 300 వికెట్లు పడ్డాయి..” అని చమత్కారాన్ని జోడించి మరీ రాసుకొచ్చింది. ఇక వాటిని చదివిన నెటిజన్స్ స్పందిస్తూ..”ప్రీతీగారిలో రొమాంటిక్ యాంగిల్ కొద్దిగా ఎక్కువే సుమీ” అనగా మరికొందరేమో మరీ ఇంత స్పీడ్ ఏంటండి బాబు అంటున్నారు. అశ్విన్-ప్రీతీ దంపతులకు ఇద్దరు కూతుళ్లు.. వారి పేర్లు ఆద్య, అకీరా. ప్రీతీ అశ్విన్ ఆడే ప్రతీ మ్యాచ్ గురించి అప్డేట్స్ ఇస్తునే ఉంటుంది. మరి తన స్టైల్లో ఫస్ట్ నైట్ గురించి చెప్పిన ప్రీతీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Happy birthday Ravichandran Ashwin 🎂
On his special day, catch a glimpse of his bowling prowess at the @T20WorldCup 2021 📽️
Will he repeat these performances in Australia? 🤔
— ICC (@ICC) September 17, 2022
Ashwin Wife Comments On Their First Night pic.twitter.com/rDIr83WpW9
— Sekhar Rambo (@RamboSekhar) September 19, 2022