యువరాజ్ సింగ్.. ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. భారత్ కు 2007లో టీ20 ప్రపంచ కప్ ను, 2011 వరల్డ్ కప్ ను అందించటంలో కీలక పాత్ర పోషించాడు. అతడు మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటాడో.. తనను గెలికితే అంతే ధీటుగా సమాధానం చెబుతాడు. ఈ విషయం ఇంగ్లాండ్ జట్టుకు చాలా బాగా తెలుసు. అది 2007 టీ20 ప్రపంచ కప్ ఇంగ్లాండ్ తో మ్యాచ్.. ఈ మ్యాచ్ ను ప్రపంచ క్రీడాభిమానులు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక ఇంగ్లాండ్ బౌలర్ కైతే జీవితాంతం గుర్తిండిపోద్ది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ మ్యాచ్ లోనే యువీ 6 బాల్స్ కు 6 సిక్స్ లు కొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అయితే ప్రస్తుతం యువీ ఈ వీడియోని తాజాగా తన ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 15 సంవత్సరాలకి ఓ స్పెషల్ పర్సన్ తో ఈ వీడియో చూస్తున్నాను.. అంటూ రాసుకొచ్చాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అది 2007 టీ20 ప్రపంచ కప్ భారత్-ఇంగ్లాండ్ ల మధ్య మ్యాచ్.. క్రీజ్ లో యువరాజ్-ధోనీలు ఉన్నారు. అండ్రూ ఫ్లింటాప్ తో యువరాజ్ కు వాగ్వాదం జరిగింది. కానీ దాని ఫలితాన్ని మాత్రం పాపం.. బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ అనుభవించాడు. ఈ మ్యాచ్ లో 19వ ఓవర్ వేయడానికి వచ్చాడు బ్రాడ్ క్రీజ్ లో ఉన్న యువీ అతడికి చుక్కలు చూపించాడు. ఏకంగా 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి అంతర్జాతీయ టీ20ల్లో తొలి క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు. అదీ కాక 461 స్ట్రైక్ రేట్ తో కేవలం 12 బాల్స్ లోనే 50 పరుగులు చేశాడు. దాంతో ఇండియా 20 ఓవర్లలో 218/4 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ 18 రన్స్ తో విజయం సాధించింది.
ఈ క్రమంలోనే ఈ విధ్వంసానికి నేటి (సెప్టెంబర్ 19)తో 15 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా యువరాజ్ తన కొడుకు ఓరియన్ కిచ్ తో కలిసి ఈ వీడియోని చూస్తున్న వీడియోని తన ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కొడుకును తన పై కూర్చో బెట్టుకుని మ్యాచ్ ను చూస్తూ.. 15 ఏళ్లకు ఒక మంచి భాగస్వామితో కలిసి ఈ వీడియో చూస్తున్నాను అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గామారింది. మరి యువరాజ్ విధ్వంసానికి 15 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Couldn’t have found a better partner to watch this together with after 15 years 👶 🏏 #15YearsOfSixSixes #ThisDayThatYear #Throwback #MotivationalMonday #GetUpAndDoItAgain #SixSixes #OnThisDay pic.twitter.com/jlU3RR0TmQ
— Yuvraj Singh (@YUVSTRONG12) September 19, 2022
6️⃣ x 6️⃣ 🔥#OnThisDay in 2007, where were you when Yuvraj Singh became the first batter in men’s T20Is to smash six sixes in an over? 😮pic.twitter.com/FRsc8ORIWs
— ESPNcricinfo (@ESPNcricinfo) September 19, 2022