టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్.. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. తొలుత అండర్ 19 జట్టుకు కోచ్‌గా పనిచేసిన ద్రవిడ్.. యంగ్ టీమిండియాతో అద్భుతాలు చేశాడు. మరో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అతని ఒత్తిడితో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్.. రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్న టీమ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఎన్నో అంచనాలతో టీమిండియా కోచింగ్ బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్.. ఆశించిన స్థాయిలో మాత్రం ప్రభావం చూపలేకపోయారు. కోచ్‌గా టీమిండియాతో అద్భుతాలు చేస్తారనుకుంటే.. ప్రయోగాలతో ఉన్న జట్టును నాశనం చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఇటివల ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా సెమీస్‌తోనే సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే.. ద్రవిడ్, కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. టీమిండియా టీ20 వరల్డ్ కప్‌ను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. దాని కోసం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి కోచ్ ద్రవిడ్ అనేక ప్రయోగాలు చేశారు. కొంత మంది సీనియర్ బౌలర్లను టీ20లకు పూర్తిగా పక్కనపెట్టి.. ఒక ప్రణాళిక ప్రకారం వరల్డ్ కప్పే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. కొంతమంది యువ ఆటగాళ్లకు మాత్రమే ఎక్కువ అవకాశాలు ఇచ్చి వరల్డ్ కప్ కోసం టీమ్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. తీరా వరల్డ్ కప్ వచ్చే సరికి.. ఎక్కువ అవకాశాల అందుకున్న ఆటగాళ్లు గాయాలతోనో, పూర్ ఫామ్తోనూ జట్టుకు దూరం కాగా.. అసలు ఏడాది మొత్తం ఒక్క టీ20 మ్యాచ్ ఆడని షమీ, అశ్విన్ లాంటి ఆటగాళ్లే జట్టుకు దిక్కయ్యారు.
దీంతో ద్రవిడ్ ప్లాన్లు అన్ని వృథాగా కావడంతో పాటు.. టీమిండియాకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఇక వరల్డ్ కప్ తర్వాత బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో తేడాతో ఓడిపోవడంతో ద్రవిడ్‌పై విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. అసలు ద్రవిడ్‌ను కోచ్‌గా తప్పించాలనే వరకు వెళ్లింది పరిస్థితి. అయితే.. ఆ వెంటనే బంగ్లాదేశ్‌తోనే జరిగిన తొలి టెస్టులో టీవిండియా ఘన విజయం సాధించడంతో ఆ విమర్శలు కాస్త తగ్గాయి. కాగా.. రేపటి (గురువారం) నుంచి టీమిండియా.. బంగ్లాదేశ్‌తో చివరిదైన రెండో టెస్టు ఆడనుంది. ఈ టెస్టు కోసం టీమిండియా నెట్ ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. అయితే.. టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్.. బంగ్లాదేశ్ ఆటగాళ్లకు కోచింగ్ ఇవ్వడం విశేషంగా మారింది. భారత కోచ్ అయిఉండి.. ప్రత్యర్థి ఆటగాళ్లకు మెళుకువలు నేర్పించడం ఏంటని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే.. బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ రహీమ్‌కు ద్రవిడ్ బ్యాటింగ్ టిప్స్ ఇస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ద్రవిడ్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mushfiqur Rahim taking some batting advice from Rahul Dravid. pic.twitter.com/o8rw56R0o9
— Johns. (@CricCrazyJohns) December 21, 2022