ప్రపంచ క్రికెట్‌లో టాప్ 8 టీమ్స్ ముందు ఇప్పుడున్న ప్రధాన లక్ష్యం టీ20 వరల్డ్ కప్ గెలవడం. మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా పొట్టి ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం ఇప్పటికే అన్ని బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. కప్‌ను ఎలాగైనా కొట్టాలని ఆటగాళ్లను మానసికంగా, శారీరంగా సిద్ధం చేస్తున్నాయి. ఆటగాళ్లు కూడా తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి.. వరల్డ్ కప్ గెలిచి హీరోలు అయ్యేందుకు సంసిద్ధంగా ఉన్నారు. కానీ.. ఎన్ని జట్లు పోటీ పడ్డా కప్ దక్కేది మాత్రం ఒక్క టీమ్‌కే. మరి ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ గెలవడం అంత చిన్న విషయం కాదు. దాని కోసం ఎంతో బలమైన జట్టు, అంతకుమించి పక్కా గేమ్ ప్లాన్ అవసరం. కేవలం టోర్నీ ఆడుతున్నప్పుడే కాదు.. టోర్నీ ఆరంభానికి ముందే కప్ గెలిచేందుకు ఒక పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలి. అలాంటి టీమ్ మాత్రమే విశ్వవిజేతగా నిలవగలదు.
మరి అలాంటి ప్లానింగ్ విషయంలో ఇండియా-పాకిస్థాన్ బోర్డులు ఎంతమేర ముందుచూపుతో ఉన్నాయని పరిశీలిస్తే.. ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2022 కంటే ముందు పాకిస్థాన్ జట్టు.. న్యూజిలాండ్‌లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో ట్రైసిరీస్ ఆడుతోంది. టీ20ల్లో బలమైన న్యూజిలాండ్‌తో పాటు, ఉపఖండ టీమ్ బంగ్లాదేశ్‌తో ట్రై సిరీస్‌ను ప్లాన్ చేయడం వెనుక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు అర్థమవుతోంది. పైగా.. న్యూజిలాండ్ పిచ్‌లు ఆస్ట్రేలియా పిచ్‌లను పోలి ఉంటాయి. దీంతో వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీ ముందు అక్కడి పిచ్‌లపై అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం ద్వారా పిచ్‌ల గురించి మంచి అవగాహన వస్తుంది. ఇది కచ్చితంగా పాక్ జట్టుకు వరల్డ్ కప్‌లో ఉపయోగపడుతుంది.
ఇలా ముందు చూపుతో టీ20 వరల్డ్ కప్ కంటే ముందు ఒక మంచి ప్రాక్టీస్ సెషన్ లాంటి సిరీస్‌ను పాక్ క్రికెట్ బోర్డు పకడ్బంధీగా ప్లాన్ చేసింది. మరి ఇదే టైమ్‌లో టీమిండియా ఏం చేస్తుందంటే.. ఆస్ట్రేలియా వెళ్లి నెట్ ప్రాక్టీస్‌లు చేస్తోంది. ప్రాక్టీస్ చేయడం మంచిదే కానీ.. ఇంటర్నేషనల్ లెవెల్లో న్యూజిలాండ్ లాంటి టీమ్‌తో ఆడితే వచ్చే కాన్ఫిడెన్స్ ముందు నెట్ ప్రాక్టీస్ ఎందుకూ పనికి రాదు. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లాంటి బలమైన జట్లతో టీ20 సిరీస్‌లు ఆడారు కదా అనుకుంటే.. అవి రెండు సిరీస్‌లు స్వదేశంలో జరినవే.. మన దేశంలో మన పిచ్‌లపై ఆడి గెలవడం.. మన జబ్బలు మనం చర్చుకున్నట్లే. ఉపఖండపు పిచ్‌లకు.. ఆస్ట్రేలియా పిచ్‌లకు చాలా తేడా ఉంటుంది.
మన దేశంలో బాగా ఆడి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాను ఓడించామనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో వరల్డ్ కప్ బరిలోకి దిగి.. బొక్కబోర్లా పడే ప్రమాదం ఉంది. ఈ నెల 23న పాకిస్థాన్‌తో మ్యాచ్ కంటే ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్‌లు ఉన్నా.. అవి రియల్ మ్యాచ్ ఇచ్చినంత హై కాన్ఫిడెన్స్‌ను ఇవ్వలేవు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధనికి బోర్డు, హంగూ ఆర్భాటం ఉన్న బీసీసీఐ ఈ విషయంలో మాత్రం కాస్త వెనుకబడిందనే చెప్పాలి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో పోల్చుకుంటే.. వరల్డ్ కప్ కంటే ముందు సరైన ప్రణాళికను బీసీసీఐ రూపొందించలేకపోయింది. మరి ఈ చిన్న తప్పదానికి టీమిండియా ఎంత మూల్యం చెల్లించుకుంటుందో చూడాలి.
Unchanged playing XI for today’s match 👇#NZvPAK | #NZTriSeries pic.twitter.com/3xnEwpipwp
— Pakistan Cricket (@TheRealPCB) October 8, 2022
#TeamIndia had a light training session yesterday at the WACA. Our strength and conditioning coach, Soham Desai gives us a lowdown on the preparations ahead of the @T20WorldCup pic.twitter.com/oH1vuywqKW
— BCCI (@BCCI) October 8, 2022