ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే అదో మినీ యుద్ధం. క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తి కనబర్చే మ్యాచ్ అది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ మెగా ఈవెంట్స్‌లోనే భారత్-పాక్ జట్లు తలపడతున్నాయి. అంతకుముందే భారీ క్రేజ్ ఉన్న ఈ దాయాదుల పోరు.. ఎప్పుడో ఏడాదికి ఒకసారి జరుగుతుండటంతో ఆ క్రేజ్ మరింత ఎక్కువైంది. మ్యాచ్ ఉందంటే చాలు కొన్ని నెలల ముందే టిక్కెట్లన్ని బుక్కైపోతున్నాయి. ఒక మ్యాచ్ టీవీల్లో, ఫోన్లలో చూసేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతూ.. అందులోనూ రికార్డులు నమోదు అవుతున్నాయి. ఇంతటి క్రేజ్ ఉన్న మ్యాచ్‌ల్లో టీమిండియాదే పైచేయి కావడం విశేషం. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021కు ముందు ఏ వరల్డ్ కప్‌లో అయినా భారత్ చేతిలో పాక్‌కు ఓటమే.
తొలి సారి పాకిస్తాన్ 2021లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో విజయం సాధించింది. మరోసారి ఈ రెండు జట్లు ఆస్ట్రేలియా వేదికగా మరికొన్ని రోజుల్లో ఆరంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2022లో పోటీ పడనున్నాయి. గతేడాది సాధించిన విజయాన్ని కొనసాగించాలని పాకిస్థాన్, ఆ ఓటమికి బదులు తీర్చుకుంటూ.. వరల్డ్ కప్స్‌లో పాక్‌పై తమ ఆధిపత్యం తిరిగి నిలబెట్టుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
రమీజ్ రాజా మాట్లాడుతూ.. ‘గతంలో వరల్డ్ కప్ వేదికల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ల్లో పాక్‌ను అండర్‌డాగ్స్‌లా భావించేవారు. కానీ.. ఇప్పుడు బాబర్ అజమ్ కెప్టెన్‌గా ఉన్న జట్టుకు ఇండియా గౌరవిస్తుంది. నేను కూడా పాకిస్థాన్ తరఫున వరల్డ్ కప్‌లు ఆడాను. కానీ.. 2021కి ముందు వరల్డ్ కప్ ఈవెంట్స్‌లో భారత్‌ను మేము ఓడించలేకపోయాం. కానీ. ఆ పని బాబర్ కెప్టెన్సీలోని పాకిస్థాన్ జట్టు చేసింది. పరిమిత వనరులు ఉన్న జట్టు మిలియన్ డాలర్ టీమ్(టీమిండియా)ను ఓడిస్తుండటం గొప్పవిషయం. గతంలో పాక్‌ను ఒక బలహీనమైన ప్రత్యర్థిగా చూసే భారత్.. ఇప్పుడు పాక్ తమను ఓడించగలదని భావిస్తూ.. బాబర్ టీమ్‌కు గౌరవం ఇస్తుంది.’ అని రమీజ్ అన్నారు.
కాగా.. 7 సార్లు వన్డే వరల్డ్ కప్ వేదికలపై, 5 సార్లు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో పాక్‌ను ఓడించిన భారత్.. తొలి సారి 2021 టీ20 వరల్డ్ కప్‌లో ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత ఆసియా కప్‌లో కూడా తొలి మ్యాచ్ గెలిచినా.. సూపర్ ఫోర్ స్టేజ్‌లో భారత్ పాక్ చేతిలో ఓడింది. గతంలో భారత్‌తో మ్యాచ్ అంటేనే వణికిపోయే పాకిస్థాన్.. ఇప్పుడు గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది. బాబర్ అజమ్ కెప్టెన్సీలోని పాకిస్థాన్ టీమ్ టీ20 ఫార్మాట్‌లో ఒక బలమైన జట్టుగా రూపొందింది. కాగా.. ఆసియా కప్ 2022 ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓటమి, స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో 3-4తో సిరీస్ ఓటమితో పాక్ క్రికెట్ అభిమానులు ఆ జట్టు ఆటగాళ్లపై అవమానకర రీతిలో విమర్మలు, హేళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే రమీజ్ రాజా ఈ విధంగా వ్యాఖ్యానించారు. పాక్ టీమ్‌ను చిరకాల ప్రత్యర్థే గౌరవిస్తున్నప్పుడు.. మీరు జట్టుకు అండగా నిలబడాలని ఆయన ఉద్దేశం.
PCB chief Ramiz Raja has said that Team India have now started to give Pakistan respect and hence the Babar Azam-led side needs to be appreciated for giving India a tough fight#INDvPAK #T20WorldCuphttps://t.co/BzofZtlUIK
— CricketNDTV (@CricketNDTV) October 8, 2022
ఇది కూడా చదవండి: సంచలన నిర్ణయం! కొత్త ఇన్నింగ్స్ అంటూ పుజారా పోస్టు..