క్రీడా ప్రపంచంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉంటాయి. బాగా రాణిస్తే ఆకాశానికి ఎత్తేస్తారు.. విఫలం అయితే ఆ ఆకాశానికి ఎత్తేసిన వాళ్లే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు. ఇక నీ పని అయిపోయింది.. నీ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించు అని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. ఇలాంటి వారి ఉచిత సలహాలు నేను పట్టించుకోను అంటున్నాడు మన రన్ మెషిన్ కింగ్ కోహ్లీ. టీవీల ఎదుట కూర్చుని, ప్రపంచం అంతా తెలిసేలా నాకు సలహాలు ఇస్తే నేను అస్సలు పట్టించుకోను అంటూ ఘాటుగా స్పందించాడు. ఆదివారం జరిగిన పాక్-భారత్ మ్యాచ్ తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్ లో తన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు పంచుకున్నాడు. ఈ క్రమంలోనే మిస్టర్ కూల్ ధోని పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
విరాట్ కోహ్లీ.. ప్రపంచ మేటి బ్యాట్స్ మెన్ లలో ఒకడు.. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ గత కొంత కాలంగా ఫామ్ లేమితో సతమతమవుతూ.. తీవ్ర విమర్శలు ఎదుర్కొవడం మనం చూశాం. ఈ విమర్శలన్నింటికి తాజాగా తన బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు ఈ రన్ మిషన్. ఆసియా కప్ లో భాగంగా ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు అర్దశతకాలు సాధించి ఫామ్ లోకి వచ్చాడు. హాంకాంగ్ పై అద్భుత అర్ధ శతకం సాధించిన కోహ్లీ అదే ఫామ్ ను పాక్ పై కొనసాగించాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడిన కోహ్లీ ఈ మ్యాచ్ ఓటమిపై అలాగే తన జీవితంలో జరిగిన మర్చిపోని సంఘటనల గురించి మాట్లాడాడు.
కోహ్లీ మందుగా మ్యాచ్ గురించి మాట్లాడుతూ. ” నేను 14 సంవత్సరాల నుంచి ఆడుతున్నాను మాకు గెలుపోటములు సహజమే. దాని గురించి మేం పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే ఎవరికి తగ్గట్టు వారు ఆడుతున్నారు. మేం రన్స్ చేసే క్రమంలో మిడిల్ ఓవర్లలో వికెట్లు చేజార్చుకున్నాం దాని గురించి మేం బాధపడట్లేదు. ఇక పాక్ ఆటగాళ్లు చాలా బాగా ఆడారు. ప్రత్యేకించి నవాజ్ దూకుడుతో పాక్ విజయం సాధించింది.” అని తెలిపాడు. ఇక తన ఫామ్ పై వచ్చిన విమర్శలపై ప్రశ్నించగా..” టీవీల ముందు కూర్చుని అందరికి తెలిసేలా సలహాలు, సూచనలు ఇస్తే నేను అస్సలు పట్టించుకోను. అదీ కాక అలాంటి వాటికి నేను విలువ ఇవ్వను అంటూనే నా లోపాలు గురించి ఏదైనా మాట్లాడాలి అనుకుంటే డైరెక్టు గా నాతో మాట్లాడండి.. అప్పుడు నేను వాటి గురించి ఆలోచిస్తాను” అని పేర్కొన్నాడు.
ఇక ధోనితో అనుబంధం గురించి అడగ్గా..” నేను గతంలో టెస్ట్ కెప్టెన్సీకి రాజీనామ చేసినప్పుడు నాకు ఒకే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అతడితో కలిసి నేను చాలా ఏళ్లు ఆడాను. అతడు మరెవరో కాదు ధోనీ. ఇండియా టీంలో చాలా మంది దగ్గర నా ఫొన్ నెంబర్ ఉంది కానీ ఎవరూ నాకు కాల్ చేయలేదు. ధోనీ ఒక్కడే నాకు పర్సనల్ గా మెసేజ్ చేశాడు. మీకు నిజాయితీతో కూడిన బంధాలు ఉంటే మిమ్మల్ని వారు మర్చిపోరు.. పైగా వారు ఎప్పుడు మీ మంచినే కోరుకుంటారు. ఇక నాకూ ధోనీ భాయ్ కి మధ్య అభద్రతా భావం లేదు. నకిలీ స్నేహం నుంచే ఆశించడాలు పుడతాయి మా మధ్య అలాంటి నకిలీ స్నేహం లేదు. ఇక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అర్షదీప్ కు విరాట్ అండగా నిలిచాడు. “ఈ మ్యాచ్ లో పరిస్థితులు అప్పడు ఉత్కంఠంగా ఉన్నాయి. దాంతో మామ్ములుగానే ఆటగాడికి ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి కారణంగానే అర్షదీప్ క్యాచ్ ను ఒదిలేశాడు.. ఇవన్నీ మ్యాచ్ లలో సహజమే.
నేనూ గతంలో పాక్ పై ఓ చెత్త షాట్ ఆడి అవుట్ అయ్యా.. ఆరోజు నిద్ర పట్టక పోవడంతో తెల్లవార్లూ సీలింగ్ ను చూస్తూనే గడిపాను అని గుర్తు చేసుకున్నాడు. ఇక హార్దిక్, సూర్య కుమార్ లు మంచి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు వారి సేవలను జట్టుఎప్పుడూవినియోగించుకుంటుంది. అంటూనే హార్దిక్ ఇటు బౌలింగ్, అటూ బ్యాటింగ్ లో రాణించడానికి శ్రమించడం చాటా కష్టం దాన్ని పాండ్యా అధిగమిస్తున్నాడు. ఇక సూర్యకుమార్ చెలరేగితే ప్రత్యర్థి నుంచి మ్యాచ్ ను సులువుగా లాగేసుకుంటాడు” అంటూ ప్రశంసించాడు. మరి కింగ్ విరాట్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత తొలిసారి ఇలా తన మనసులోని మాటలను అందరితో పంచుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.