ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్. ఏ టీమ్ సాధ్యంకానీ విధంగా ఏకంగా 5 సార్లు ఐపీఎల్ టైటిల్ సాధించింది ముంబై. కానీ.. ఐపీఎల్ 2022 మాత్రం వారికి ఒక పీడకలలా మారింది. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ అత్యంత దారుణంగా విఫలం అయింది. ఆ చేదు అనుభవం నుంచి బయటపడుతూ.. మరో రెండు కొత్త లీగ్స్‌లో జట్లను కొనుగోలు చేసి.. తమ ఫ్రాంచైజ్‌ను విస్తరించింది. యూఏఈ టీ20 లీగ్‌లో ఎమిరేట్స్ ఫ్రాంచైజ్‌ను, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో కేప్‌టౌన్ ఫ్రాంచైజ్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్‌గా ఉన్న ముంబై.. మిగతా వేదికలపై కూడా అదే సక్సెస్‌ను కొనసాగించాలని భావిస్తోంది. అందుకే ఆ జట్టు విజయవంతమైన ప్రయాణంలో చాలా కాలంగా కలిసి పనిచేస్తున్న హెడ్ కోచ్ మహేలా జయవర్దనే, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ జహీర్ ఖాన్‌లకు మరింత కొత్త బాధ్యతలను అప్పగించింది. వారికి ప్రమోషన్ ఇస్తూ.. వారి కోసం కొత్త పదవులను సృష్టించింది.
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా ఉన్న జయవర్దనేను గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎంఐగా కొత్త బాధ్యతల్లో నియమించింది. సెంట్రల్ టీం వ్యూహాత్మక ప్రణాళిక, సమీకృత గ్లోబల్ హై-పెర్ఫార్మెన్స్ ఎకో-సిస్టమ్‌ను సృష్టించడం, ప్రతి జట్టు కోచింగ్‌కు బాధ్యతతో సహా ప్రపంచవ్యాప్తంగా గ్రూప్ క్రికెట్ కార్యకలాపాలకు సీనియర్ నాయకత్వాన్ని మహేలా అందించనున్నారు. మొత్తంగా మూడు లీగ్స్‌లోనూ ముంబై టీమ్స్‌కు జయవర్దనే బాస్‌గా ఉండనున్నాడు. అలాగే మూడు జట్ల టీమ్ హెడ్ కోచ్‌లతో సన్నిహితంగా పని చేస్తూ ఎంఐ బ్రాండ్ ఆటను తీసుకువచ్చేలా మహేలా చూసుకుంటాడు. ఇక భారత మాజీ స్టార్ పేసర్ జహీర్ ఖాన్ గ్లోబల్ హెడ్ ఆఫ్ డెవలప్‌మెంట్‌గా ప్రమోషన్ పొందాడు. క్రికెట్ డెవలప్‌మెంట్, ప్లేయర్ డెవలప్‌మెంట్‌ను జహీర్ చూసుకుంటాడు. ప్రతిభను గుర్తించడం, ముంబై ఇండియన్స్ ప్రోగ్రామ్‌ను రూపొందించడం వంటి పనులు జహీర్ ఆధ్వర్యంలో జరుగుతాయి.
ప్రపంచ వ్యాప్తంగా మూడు లీగ్స్‌లోనూ ముంబై ఇండియన్స్ ఒకే విధంమైన బ్రాడ్ గేమ్‌ను కలిగి ఉండేందుకు ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లు ముంబై బాస్ ఆకాష్ అంబానీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘మా గ్లోబల్ కోర్ టీమ్‌లో జయవర్దనే, జహీర్ చేరినందుకు నేను చాలా సంతోషంగా ఉంది. ఇద్దరూ ఎంఐ ఫ్యామిలీలో చాలా ఏళ్లుగా అంతర్భాగంగా ఉన్నారు. ఎంఐ క్రికెట్ స్ఫూర్తిని వారు ప్రతిబింబిస్తారు. ప్రపంచవ్యాప్తంగా మా టీమ్స్ అన్నింటిలో ఒకే విధమైన బ్రాండ్ క్రికెట్ ఉండేలా చూస్తారు. ’ అని ఆకాష్ వెల్లడించారు. ఇలా ముందు జాగ్రత్తగా అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో అద్భుతంగా విజయవంతమైందని.. యూఏఈ, సౌతాఫ్రికా లీగ్స్‌లోనూ ముంబై సక్సెస్ అవుతుందని ఈ సందర్భంగా ముంబై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: అప్పుడు ధోని ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉంటే.. నా జీవితం మరోలా ఉండేది!
🚨 Director of Cricket Operations ➡️ Global Head of Cricket Development 🌏
Let’s welcome ZAK as our Global Head of Cricket Development 🙌#OneFamily #MumbaiIndians #MIemirates #MIcapetown @MIEmirates @MICapeTown @ImZaheer pic.twitter.com/VBfzzrBG6J
— Mumbai Indians (@mipaltan) September 14, 2022
🚨 Head Coach ➡️ Global Head of Performance 🌏
We are delighted to announce Mahela Jayawardene as our Global Head of Performance 🙌💙#OneFamily #MumbaiIndians #MIemirates #MIcapetown @MIEmirates @MICapeTown @MahelaJay pic.twitter.com/I4wobGDkOQ
— Mumbai Indians (@mipaltan) September 14, 2022