టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఎంపికై.. గాయం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. కాగా.. వరల్డ్ కప్ పోటీలకు మరికొంత సమయమే ఉన్ననేపథ్యంలో బుమ్రా స్థానంలో మరో పేసర్‌ను తీసుకునే ప్రయత్నాలను సెలెక్టర్లు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అద్భుతంగా రాణించి.. బుమ్రా స్థానం కోసం పోటీలో ముందున్నాడు. అతనికి పోటీగా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ, యువ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ కూడా ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ.. షమీ ఫిట్‌నెస్‌పై సందేహాలు వ్యక్తం అవ్వడం.. దీపక్ చాహర్ గాయం పడటంతో సిరాజ్‌కు రూట్ క్లియర్ అయినట్లు అంతా భావించారు.
పైగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడంతో ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కడం ఖాయంగా కనిపించింది. ఇదే సమయంలో షమీ ఎన్‌సీఏలో జరిగిన ఫిట్‌నెస్ టెస్టును క్లియర్ చేయడంతో సిరాజ్ కథ మళ్ల మొదటికొచ్చింది. బుమ్రా స్థానం భర్తీ చేయడానికి మొదటి నుంచి షమీని ఫస్ట్ ఆప్షన్‌గా ఉన్న నేపథ్యంలో అతను ఫిట్‌నెస్ సాధించడం సిరాజ్ ఆశలపై నీళ్లు చల్లేలా ఉంది. బుమ్రా స్థానంలోకి షమీనే తీసుకునేందుకు సెలెక్టర్లు సైతం మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. పైగా షమీ ఫిట్‌నెస్ టెస్టు పాస్ అవ్వడంతో అతనికి రూట్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది. షమీ ఫిట్‌నెస్ టెస్టు రిజల్ట్ కోసమే ఇన్ని రోజులు బుమ్రా స్థానాన్ని భర్తీ చేయకుండా బీసీసీఐ ఎదురుచూసినట్లు సమాచారం.
ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న మొహమ్మద్ షమీ 15 మందితో కూడిన టీమ్‌లోకి వస్తే.. సిరాజ్‌ను స్టాండ్‌బై ప్లేయర్‌గా తీసుకునే అవకాశం ఉంది. తుది జట్టులో స్థానం దక్కకున్నా.. స్టాండ్‌బైగా సిరాజ్ షమీతో పాటు ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు. కాగా.. బుమ్రా స్థానంలో షమీని తీసుకుంటున్నట్లు అధికారిక ప్రకటన ఈ రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. కాగా.. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా వెళ్లి పెర్త్‌లో లోకల్ టీమ్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో వెస్టర్న్ ఆస్ట్రేలియా టీమ్‌తో ఆడి విజయం కూడా సాధించారు. ఇక ఈ నెల 23న చిరాకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అసలు సిసలైన మ్యాచ్‌తో భారత్ వరల్డ్ కప్ వేట మొదలుపెట్టనుంది.
Mohammad Shami has cleared the fitness test. (Reported by Rev Sportz).
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2022
The experience of Shami or the exuberance of Siraj – who should make it to India’s T20 World Cup squad and fly to Australia?
Shami’s last professional match was in July this year. During this time, Siraj has played county cricket and 10 international games. pic.twitter.com/Li92XHJdjS
— Wisden India (@WisdenIndia) October 11, 2022