ఆర్యన్ రాజేష్- నమిత జంటగా వచ్చిన ‘సొంతం’ మూవీలో సునీల్ పండించిన కామెడీ అందరకి గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే.. ఆ సినిమాలో సునీల్ కడుపుబ్బా నవ్విస్తాడు కనుక. ఆ డైలాగ్స్ లో కెల్లా క్రికెట్ కు సంబంధించింది అంటే.. ‘కళ్లు కనపడని వాళ్ళను ఏమి చేస్తారు రా..’ అని లెక్చరర్ అడిగితే, సునీల్ క్షణం ఆలస్యం చేయకుండా..’అంపైర్లను చేరుస్తారంటాడు’. దాన్ని నిజం చేయడానికి ప్రస్తుత అంపైర్లు తెగ ఆరాటపడుతున్నారు. అలాంటి సంఘంటన మహిళా ఆసియా కప్ టోర్నీలో చోటుచేసుకుంది. ఈ మ్యాచులో అంపైర్ ఇచ్చిన ఓ నిర్ణయానికి శ్రీలంక క్రికెటర్ కు పిచ్చెక్కింది అంటే నమ్మరు.
బంగ్లాదేశ్ వేదికగా మహిళా ఆసియా కప్ 2022 టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం శ్రీలంక, పాకిస్తాన్ జట్ల మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో జట్ల మధ్య జరిగిన పోరు కంటే.. ఆన్ ఫీల్డ్ అంపైర్లలో ఒకరైన ‘శివాని శర్మ’ ఇచ్చిన నిర్ణయం మ్యాచుకే హైలైట్ గా నిలిచింది. అంపైర్ కు.. ‘ఏమి ఇవ్వాలో అర్థం కానప్పుడు.. ఏదో ఒకటి ఇస్తే పోలా..’ అన్నట్లుగా ప్రవర్తించడమే అందుకు కారణం. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ సదరు అంపైర్ ను ఆడుకుంటున్నారు.
Mind Blowing Umpiring..
Women’s Asia Cup 2022,
Pakistan Women vs Sri Lanka Women pic.twitter.com/4lRuTdb9F9— Govardhan Reddy (@gova3555) October 11, 2022
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 18.5 ఓవర్లలో 112 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. అనంతరం 113 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు ఇన్నింగ్స్ ను ధాటిగానే ప్రారంభించింది. ఈ క్రమంలో మూడో ఓవర్ వేయడానికి బాల్ అందుకున్న అచిని కులసూరియా రెండో బంతికి పాక్ బ్యాటర్ మునీబా అలీని ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ చేర్చే ప్రయత్నం చేసింది. అయితే.. బాల్ ప్యాడ్లను తాకకుండా బ్యాటర్ గ్లోవ్స్ ను తాకుతుంది. ఇవేమి పట్టించుకోని అంపైర్.. బౌలర్ అప్పీల్ చేయగానే.. ఏమి ఇవ్వాలో అర్థం కాక లెగ్ బైస్ గా ప్రకటిస్తుంది. అంపైర్ చెప్పినట్లుగా.. అది లెగ్ బైస్ అయితే.. బ్యాటర్ ‘ఎల్బీడబ్ల్యూ’గా వెనుదిరగాల్సిందే. అంపైర్ నిర్ణయానికి అవాక్కయిన శ్రీలంక బౌలర్ ఏమీ అనలేక తల కిందకు వంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాగా, ఈ మ్యాచులో పాకిస్తాన్ మాహిళా జట్టు 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.
— Richard (@Richard10719932) October 11, 2022