Marcus Stoinis Says Jai Shree Ram: ఆస్ట్రేలియా క్రికెటర్ మార్కస్ స్టోయినీస్ జై శ్రీరామ్ అంటూ పేర్కొనడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు స్టోయినీస్ వీడియోను తెగ షేర్లు చేస్తున్నారు. మరి స్టోయినీస్ ఆ మాట ఎప్పుడు అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
హిందువులంతా ఎంతో పవిత్రంగా భావించే నినాదం ‘జై శ్రీరామ్’, ఆ పదం పలికితే వచ్చే భక్తి పారవశ్యం అంతా ఇంతా కాదు. ఏదో తెలియని ధైర్యం ‘జై శ్రీరామ్’ అనే నినాదంలో ఉంటుందని చాలా మంది బలంగా విశ్వసిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, శోభాయాత్రల సమయంలో ఎక్కువగా ఈ నినాదం వింటూ ఉంటాం. తాజాగా జై శ్రీరామ్ నినాదాన్ని ఓ స్టార్ క్రికెటర్ ఉచ్ఛరించడం ప్రత్యేకతను సంతరించుకుంది. అందులోనూ.. విదేశీ క్రికెటర్ జై శ్రీరామ్ అంటూ పలకడం విశేషం. ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినీస్.. ‘జై శ్రీరామ్’ అంటూ ఒక వీడియో విడుదల చేశాడు.
ఇటివల ముగిసిన శ్రీరామ నవమి పండుగ సందర్భంగా స్టోయినీస్ భారతీయులందరికీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపాడు. శుభాకాంక్షలు తెలిపిన తర్వాత.. జైశ్రీరామ్ స్లోగన్ ఇచ్చాడు. ఆ వీడియో ప్రస్తుతం సోసల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. ఐపీఎల్ 2023 కోసం ఇండియాలోనే ఉన్న స్టోయినీస్.. తన హోటల్ రూమ్‌లో ఈ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. సాధారణంగా స్టోయినీస్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటాడు. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడుతున్న స్టోయినీస్.. తొలి మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్న స్టోయినీస్.. ఖాళీ సమయం దొరికితే.. ఇలా వీడియోలు చేస్తున్నాడు. అయితే.. చాలా మంది ఆస్ట్రేలియన్లకు మన భారతదేశ సంస్కృతి, సంప్రదాయలన్నా ఎంతో గౌరవం. డేవిడ్ వార్నర్ సైతం రామ నవమి శుభాకాంక్షలు తెలిపాడు. మరి స్టోయినీస్ జై శ్రీరామ్ నినాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Marcus Stoinis says “Jai Shree Ram”
Now we’ve seen it all…— OneCricket (@OneCricketApp) March 30, 2023