బిగ్ మ్యాన్ కీరన్ పొలార్డ్ బ్యాటింగ్‌లో ఎలాంటి విధ్వంసం సృష్టించగలడో అందరికి తెలిసిందే. కొన్ని ఏళ్ల పాటు టీ20 క్రికెట్లో తిరుగులేని స్టార్ క్రికెటర్‌గా, ఆల్‌రౌండర్‌గా అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో పవర్ హిట్టింగ్తో అదరగొట్టే పొలార్డ్ తన మీడియం పేస్ బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పగలడు. ఈ రెండు క్వాలిటీలు కాకుండా.. పొలార్డ్ ఒక అద్భుతమైన ఫీల్డర్ కూడా. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా.. తన రెండో హోమ్ టీమ్‌గా భావించే ముంబై ఇండియన్స్ వదులుకున్నా.. కాసులు కురిపించే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా.. ఇంకా పొలార్డ్‌లో ఒక అద్భుత యువ ఆటగాడు బతికే ఉన్నాడని చూపిస్తున్నాడు.
యూఏఈ వేదికగా జరుగుతున్న ఐఎల్టీ20(ఇంటర్నేషనల్ లీగ్ టీ20)లో ఎంఐ ఎమిరేట్స్ తరఫున ఆడుతున్నపొలార్డ్.. మంగళవారం అబుదాబి వేదికగా డిజర్ట్ వైపర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. ఎంఐ ఎమిరేట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పొలార్డ్ కేవలం 39 బంతుల్లో ఒక ఫోర్ 6 సిక్సులతో విధ్వంసం సృష్టించి.. 67 పరుగులతో అదరగొట్టాడు. ఎంఐ ఇన్నింగ్స్‌లో పొలార్డ్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. 20 ఓవర్లలో 169 రన్స్ చేసింది. ఈ టార్గెట్‌ను వైపర్స్ టీమ్ ఛేదించి గెలిచినా.. ఫీల్డింగ్‌లో పొలార్డ్ చేసిన విన్యాసం మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. వైపర్స్ కెప్టెన్ ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్లో గాల్లోకి అమాంతం ఎగిరిదూకి.. క్యాచ్ అందుకుని 20 ఏళ్ల కుర్రాడిలా పల్టీ కొట్టి.. ఠీవీగా ఆడియన్స్‌ను చూస్తూ.. పొలార్డ్ ఇచ్చిన ఫొజు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంతర్జాతీయ క్రికెట్‌కు, ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన ఆటగాడేనా.. ఈ క్యాచ్ పట్టింది అనే అనుమానం కలిగేలా చేశాడు. అప్పటికే బ్యాటింగ్‌లో దుమ్మురేపిన పొలార్డ్.. ఫీల్డింగ్‌లో సూపర్ క్యాచ్ అందుకోవడంతో.. అతను అనవసరంగా ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడని క్రికెట్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. పొలార్డ్‌ను వదులుకుని ముంబై ఇండియన్స్ పెద్ద తప్పుచేసిందంటూ.. ఆ టీమ్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు పొలార్డ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ముంబై ఇండియన్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ముంబైతో మొదలైన తన ఐపీఎల్ కెరీర్ ముంబైతోనే ముగుస్తుందని.. పొలార్డ్ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పి.. తన లాయాలిటీ చూపించాడు. ఆ తర్వాత ముంబై.. పొలార్డ్‌ను తమ బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. అయితే.. బ్యాట్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ఇలాంటి సూపర్ క్యాచ్‌లు పడుతూ ఫుల్ ఫిట్‌గా ఉన్న పొలార్డ్‌ను ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2023 సీజన్లో ఆడించాల్సిందని.. వదులుకుని తప్పు చేసిందనే వాదన వినిపిస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ye catch kidhar dekhela lagta hai, kya bolti Paltan? 😎💪#OneFamily @KieronPollard55 https://t.co/w7GHQgEvNN
— Mumbai Indians (@mipaltan) January 25, 2023