న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ఈ తరం ఆటగాళ్లలో గొప్ప క్లాస్ ప్లేయర్. అలాంటి ఆటగాడే తన జీవితంలో ఇలాంటి ఇన్నింగ్స్‌ను, ఆ షాట్లను చూడలేదంటూ పేర్కొనడం సంచలనంగా మారింది. మరి కేన్ మామను అంతలా ఆశ్చర్యానికి గురిచేసిన ఆ షాట్లు ఆడింది ఎవరో తెలుసా? ఇంకెవరూ.. మన మిస్టర్ 360 సూర్య భాయ్. ఆదివారం మౌంట్ మాంగనూయి వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. తనకు మాత్రమే సాధ్యమైన భయంకరమైన షాట్లతో న్యూజిలాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సులతో 111 పరుగులు చేసి.. టీ20 కెరీర్‌లో రెండో సెంచరీ నమోదు చేశాడు. సూర్య చేసిన విలయతాండవానికి కివీస్ బౌలింగ్ ఎటాక్ అతలాకుతలమైపోయింది.
మ్యాచ్ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇలాంటి ఇన్నింగ్స్‌ను, షాట్లను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నాడు. కేన్ మామ మాట్లాడుతూ.. ‘ఇది మా బెస్ట్ ప్రదర్శన కాదు. సూర్య ఆడిన ఇన్నింగ్స్ ఈ లోకం లోనే లేదు. అతను ఆడిని ఇన్నింగ్స్ నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఒకటి. సూర్య ఆడిన కొన్ని షాట్లు నేనింతవరకు చూడలేదు. ఇండియన్ క్రికెటర్లు అద్బుతంగా ఆడారు. మేం తొలుత బౌలింగ్‌లో వికెట్ సరిగా తీయలేకపోయాం. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ నిరాశపరిచాం. మాకు ఇండియాకు సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఇన్నింగ్స్ తేడాగా నిలిచింది. ఇండియన్ బౌలర్లు స్వింగ్‌ను బాగా రాబట్టారు. మేము కూడా ఆ విషయంపై దృష్టిపెట్టాలి. కొన్ని సార్లు ప్రత్యేకమైన ఇన్నింగ్స్‌లు వస్తుంటాయి. ఇక సూర్య కూమార్ యాదవ్ ప్రపంచలోనే బెస్ట్ ప్లేయర్.’ అని కేన్ అన్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్-రిషభ్ పంత్ భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. పంత్ మరోసారి విఫలం అయ్యారు. 13 బంతుల్లో 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇషాన్ 36 రన్స్‌చేశాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. శ్రేయస్ అయ్యర్(13), హార్దిక్ పాండ్యా(13), దీపక్ హుడా(0), వాషింగ్టన్ సుందర్(0) విఫలం అయ్యారు. భువీ ఒక పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ 3, ఫెర్గూసన్ 2, సోధీ ఒక వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు 126 పరుగులకే ఆలౌట్ చేశారు. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక్కడే 61 పరుగులతో రాణించాడు. మిగిలిన బ్యాటర్లు విఫలం అవ్వడంతో టీమిండియా 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇక టీమిండియా బౌలర్లలో దీపక్ హుడా 4, సిరాజ్ 2, చాహల్ 2, భువీ, సుందర్ తలో వికెట్ తీసుకున్నారు.
Kane Williamson said “Some of the shots Suryakumar Yadav played which i haven’t seen before”.
— Johns. (@CricCrazyJohns) November 20, 2022
A classic T20 innings from Suryakumar Yadav at Bay Oval. pic.twitter.com/BvbBhhzR9F
— Johns. (@CricCrazyJohns) November 20, 2022