టెస్టుల్లో చితక్కొట్టేస్తున్న కేన్ మామ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. శ్రీలంకతో రెండో టెస్టులో రెచ్చిపోయి మరీ బ్యాటింగ్ తో చేశాడు. ఈ క్రమంలోనే సరికొత్త రికార్డ్ సృష్టించాడు.
హీరో నాని నటించిన జెర్సీ సినిమాలోని సేమ్ సీన్ తాజాగా శ్రీలంక-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ లో రిపీట్ అయ్యింది. సినిమాలో నాని ఏవిధంగా జట్టును గెలిపించాడో.. ఈ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ అదే విధంగా కివీస్ ను గెలిపించాడు. ఇక సేమ్ టు సేమ్ ఉన్న ఈ వీడియోను ఓ అభిమాని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసినా.. టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరింది. అది కేన్ విలియమ్సన్ కష్టంతో.. అందుకే భారత క్రికెట్ అభిమానులు కేన్ మామకు థ్యాంక్యూ చెబుతున్నారు. అయితే.. న్యూజిలాండ్-శ్రీలంక మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ మాత్రం.. టెస్టు క్రికెట్ చరిత్రలో బెస్ట్ మ్యాచ్ అనేలా జరిగింది.
పాకిస్థాన్ క్రికెటర్లపై మరోసారి వారి సొంత క్రికెట్ అభిమానులే మండిపడుతున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి.. న్యూజిలాండ్‌కు 15 ఓవర్లలో 138 పరుగుల టార్గెట్ ఇచ్చి బాబర్ అజమ్ విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఆ టార్గెట్‌ను ఛాలెంజ్‌గా తీసుకున్న న్యూజిలాండ్ టీ20 స్టైల్లో బ్యాటింగ్ చేసి.. మ్యాచ్ గెలిచేలా కనిపించింది. కానీ.. అప్పటికే లైట్ ఫెయిల్ అయిందని మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేయడంతో పాక్ ఓటమి నుంచి తప్పించుకుంది. పాకిస్థాన్ చూపించిన […]
”పడ్డచోటే నిలబడాలి.. అవమానించినప్పుడే అందనంత ఎత్తుకు ఎదగాలి” ఈ మాటను అక్షరాల నిజం చేశాడు న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్. తాజాగా జరిగిన 2023 ఐపీఎల్ మినీ వేలంలో కేన్ మామను హైదరాబాద్ సన్ రైజర్స్ వదులుకుంది. దాంతో అతడిని ఏ ఫ్రాంఛైజీ వేలంలో కొనుగోలు చేయదని అందరు భావించారు. కానీ అనూహ్యంగా కేన్ మామను రెండు కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కుంది. తనను హైదరాబాద్ వదులుకుందన్న కసిని మెుత్తం పాకిస్థాన్ తో జరుగుతున్న తొలి […]
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌పై ఐపీఎల్ మినీ వేలంలో ఫ్రాంచైజ్‌లు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఐపీఎల్ 2023 రిటేషన్‌లో భాగంగా సన్‌రైజర్స్ విలియమ్సన్‌ను రిలీజ్ చేసింది. సన్ రైజర్స్ వదులుకున్న కేన్ మామకు మంచి డిమాండ్ ఉంటుందని అంతా భావించారు. కానీ.. వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఫ్రాంచైజ్‌లు కేన్ మామను పట్టించుకోలేదు. కొంతకాలంగా సరైన ఫామ్‌లో లేని కేన్ మామను తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజ్ ముందుకు రాలేదు. కానీ.. బేస్ ధర రూ.2 […]
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇన్ని రోజులు న్యూజిలాండ్‌కు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా కొనసాగిన కేన్ మామ.. తాజాగా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కొన్నేళ్ల నుంచి తన కెప్టెన్సీలో న్యూజిలాండ్‌ను మూడు ఫార్మాట్లలో అద్భుతంగా నడిపించిన కేన్ మామ.. న్యూజిలాండ్ తొలి టెస్టు ఛాంపియన్‌గా నిలిపాడు. 2021లో టీమిండియాతో జరిగిన టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేన్ కెప్టెన్సీలోనే 2019లో న్యూజిలాండ్ వన్డే […]
టీ20 వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత.. కంటితుడుపు చర్యగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను 1-0తో గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్‌లో మాత్రం తేలిపోయింది. టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా కేన్ సేనతో వన్డే సిరీస్‌లో తలపడిన విషయం తెలిసిందే. తొలి వన్డేలో భారత్ ఓడిపోగా.. రెండో వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. ఇక బుధవారం జరిగిన మూడో వన్డేలో టాస్ ఓడిన టీమిండియా తొలుతు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కొంతకాలంగా […]
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ఈ తరం ఆటగాళ్లలో గొప్ప క్లాస్ ప్లేయర్. అలాంటి ఆటగాడే తన జీవితంలో ఇలాంటి ఇన్నింగ్స్‌ను, ఆ షాట్లను చూడలేదంటూ పేర్కొనడం సంచలనంగా మారింది. మరి కేన్ మామను అంతలా ఆశ్చర్యానికి గురిచేసిన ఆ షాట్లు ఆడింది ఎవరో తెలుసా? ఇంకెవరూ.. మన మిస్టర్ 360 సూర్య భాయ్. ఆదివారం మౌంట్ మాంగనూయి వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. తనకు మాత్రమే సాధ్యమైన […]
మూడు టీ20ల సిరీస్ లో భాగంగా హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు, న్యూజిలాండ్ తో తలపడతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి టీ20 వర్షం కారణంగా రద్దవడంతో, ఇప్పుడు అందరి కళ్లు మౌంట్ మౌంగనుయి వేదికగా జరగాల్సిన రెండో టీ20పై పడ్డాయి. సిరీస్ లో పైచేయి సాధించాలంటే ఈ మ్యాచులో విజయం సాధించడం ఇరు జట్లకు కీలకం. దీంతో ఈ మ్యాచులో విజయం ఎవరిని వరించనుంది? ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయన్నది ఇప్పుడు చూద్దాం.. […]