అప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. పరువుపొగొట్టుకున్నారు. ఇక చివరి వన్డేలో కూడా ఓడితే.. క్లీన్‌స్వీపే. ఇలా భయంభయంగానే సౌతాఫ్రికాతో బుధవారం మూడో వన్డే ఆడేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్. భయపడుతున్నట్లుగానే ఇంగ్లండ్ బ్యాటర్లకు లుంగి ఎన్గిడి చుక్కలు చూపించాడు. జెసన్ రాయ్(1), బెన్ డకెట్(0), హ్యారీ బ్రూక్(6) లను వరుస పెట్టి పెవిలియన్ చేర్చాడు. దీంతో ఇంగ్లండ్ కేవలం 14 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో.. సౌతాఫ్రికా క్లీన్‌స్వీప్ చేయడం ఖాయంగా కనిపించింది. కానీ.. ఓటమిని ఒప్పుకొని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తన అనుభవానంత ఉపయోగించి.. మలాన్‌తో కలిసి ఇంగ్లండ్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. మూడు వికెట్ల కోల్పోయిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. భాగస్వామ్యాన్ని నిర్మిస్తూ.. సౌతాఫ్రికా బౌలర్లపై ఎదురుదాటికి దిగారు.
తొలి రెండు మ్యాచ్‌ల్లో ఎదురైన ఓటమికి ప్రతికారం తీర్చుకుంటున్నారా అన్నట్లు సౌతాఫ్రికా బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయినా.. లుంగి ఎన్గిడి నిప్పులు చెరుగుతున్నా.. మలాన్, బట్లర్ చూపించిన అద్భుత పోరాటం ఇంగ్లండ్‌ను తిరిగి మ్యాచ్‌లోకి తీసుకొచ్చింది. 14 రన్స్‌కే మూడు వికెట్లు కూల్చిన ఎన్గిడి.. బట్లర్, మలాన్‌ల విధ్వంసాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. వారు ఆడుతుంటే.. సౌతాఫ్రికా బౌలర్లు పరుగులు సమర్పించుకోవాడానికే బౌలింగ్ వేస్తున్నట్లు కనిపించింది. బట్లర్-మలాన్ జోడీ క్రీజ్‌లో కుదురుకున్న తర్వాత.. ప్రొటీస్ బౌలర్లపై ఫోర్లు సిక్సుర్ల వర్షం కురిపించారు.
127 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సులతో బట్లర్ 131 రన్స్ చేయగా.. మలాన్ 114 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులతో 118 పరుగులు చేశారు. ఇద్దరూ సెంచరీలతో చెలరేగి.. 14 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి క్లిష్టపరిస్థితుల నుంచి 4వ వికెట్ కోల్పోయే సరికి 246 పరుగులకు చేర్చారు. ఇద్దరూ.. 4వ వికెట్‌కు దుర్భేద్యమైన 232 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మలాన్, బట్లర్ సెంచరీల సునామీతో 14 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్.. సౌతాఫ్రికా ముందు 346 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. ఈ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా 43.1 ఓవర్లలో 287 పరుగులకే ఆలౌట్ అయింది. చాలా కాలం తర్వాత ఇంగ్లండ్ జట్టులోకి తిరిగొచ్చిన జోఫ్రా ఆర్చర్ 6 వికెట్లతో సౌతాఫ్రికాకు టార్చర్ చూపించాడు. దీంతో.. తొలి రెండు వన్డేల్లో ఓడి సిరీస్ సమర్పించుకున్న ఇంగ్లండ్.. చివరి వన్డేలో గెలిచి పరువు కాపాడుకుంది. మరి ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు డేవిడ్ మలాన్, జోస్ బట్లర్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🏴 ENGLAND WIN 🏴
A cracking all-round performance to finish with the win ✅ #ENGvsSA pic.twitter.com/i8aayChPet
— England’s Barmy Army (@TheBarmyArmy) February 1, 2023