ఐపీఎల్ 2023కు ఇప్పటికే చాలా మంది స్టార్ క్రికెటర్లు దూరం అయ్యారు. తాజాగా మరో స్టార్ క్రికెటర్, విధ్వంసకర ఓపెనర్ సైతం ఐపీఎల్‌కు పూర్తిగా దూరం అయ్యాడు. దీంతో పంజాబ్ కింగ్స్ టీమ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
క్రికెట్ అభిమానులకు రెండున్నర నెలల పాటు నాన్‌స్టాప్ వినోదం అందించే ఐపీఎల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా క్రికెట్ అభిమానులు ఐపీఎల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఆ ధనాధన్ బ్యాటింగ్, కళ్లు చెదిరే బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్ విన్యాసాల కోసం వేయి కళ్లతో వేచి ఉన్నారు. ఈ నెల 31న ఐపీఎల్ 2023 సీజన్ గ్రాండ్‌గా మొదలుకానుంది. అయితే.. ఈ ఏడాది కొంతమంది స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరం అయ్యారు. అందులో ప్రముఖంగా టీమిండియా స్టార్ క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్లతో పాటు విదేశీ క్రికెటర్లు కూడా ఉన్నారు.
బుమ్రా వెన్నునొప్పికి సర్జరీ కారణంగా ఐపీఎల్‌కు దూరం కాగా.. పంత్ కారు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ గాయపడి ఐపీఎల్‌తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు సైతం దూరం అయ్యాడు. ఇప్పుడు తాజాగా.. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టో సైతం ఐపీఎల్‌కు దూరం అయ్యాడు. గాయం కారణంగా కొన్ని రోజులగా ఇంగ్లండ్ జట్టుకు దూరమైన బెయిర్‌స్టో ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. దీంతో.. ఐపీఎల్‌కు సైతం దూరం కానున్నాడు. గాయం నుంచి కోలుకునేందుకు అతనికి మరింత సమయం అవసరం అవ్వడంతో.. ఐపీఎల్‌కు పూర్తిగా దూరం కానున్నాడు.
ఐపీఎల్‌లో ఆడాల్సిన టైమ్‌ను గాయం నుంచి రికవరీ అయ్యేందుకు ఉపయోగించుకుంటానని బెయిర్‌స్టో తెలిపినట్లు సమాచారం. కాగా, బెయిర్‌స్టో ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. అతను ఐపీఎల్‌కు పూర్తిగా దూరమైతే.. పంజాబ్ టీమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే. బెయిర్‌స్టోతో పాటు ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసిన మరో ఇంగ్లండ్ ప్లేయర్ విల్ జాక్స్ సైతం గాయంతో ఐపీఎల్‌కు దూరం అయ్యాడు. అతని స్థానంలో ఆర్సీబీ న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ బ్రేస్‌వెల్‌ను తీసుకుంది. మరి ఐపీఎల్‌కు బెయిర్‌స్టో దూరం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jonny Bairstow is set to miss the upcoming IPL 2023 season to focus on Ashes after recovering from golf course mishap.
(Via The Guardian)#CricTracker #JonnyBairstow #IPL2023 pic.twitter.com/WiCY5gaBLs
— CricTracker (@Cricketracker) March 21, 2023