భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. 12 ఏళ్ల క్రితం టెస్టు పార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన భారత బౌలర్ జయ్‌దేవ్ ఉనద్కట్ తొలి వికెట్ దక్కించుకున్నాడు. ఎప్పుడో 2010 డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్ ఆడిన ఉనద్కట్.. మళ్లీ ఇన్నేళ్లకు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే.. దురదృష్టవశాత్తు వీసా సమస్యలతో తొలి టెస్టు ఆడలేకపోయిన ఉనద్కట్‌కు రెండో టెస్టులో అవకాశం దక్కింది. 12 ఏళ్ల తర్వాత టీమిండియా జెర్సీలో బరిలోకి దిగిన ఉనద్కట్.. టెస్టు క్రికెట్‌లో తొలి వికెట్ తీసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. తొలి వికెట్ దక్కిన ఆనందాన్ని సహచర టీమ్ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఉనద్కట్.. పేస్‌లో ఏదో తెలియని సంతృప్తి కనిపించిదంటూ క్రికెట్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేస్తూ.. ఐదో బంతికి బంగ్లా ఓపెనర్ జాకీర్ హసన్‌ను అద్భుత బంతితో అవుట్ చేశాడు ఉనద్కట్. ఆ బాల్‌ను ఆడేందుకు ఏ మాత్రం అవకాశం లేకుండా పోయింది హసన్ దగ్గర. దీంతో.. స్లిప్‌లో ఉన్న కెప్టెన్ రాహుల్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు హసన్. ఈ వికెట్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన 12 ఏళ్లకు ఉనద్కట్‌కు తొలి వికెట్ దక్కింది. అలాగే ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఫస్ట్ వికెట్ లభించింది. ఈ వికెట్‌తో పాటు మరో అరుదైన రికార్డును సైతం.. ఉనద్కట్ తన పేరిట లిఖించుకున్నాడు. సుదీర్ఘ కాలం తర్వాత.. భారత్ టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన తొలి క్రికెటర్‌గా ఉనద్కట్ నిలిచాడు.
2010లో టీమిండియా తరఫున తొలి టెస్టు మ్యాచ్ ఆడిన ఉనద్కట్ మళ్లీ.. భారత్ తరఫున టెస్టు ఆడలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా.. దేశవాళీ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు చివరి నిమిషంలో చోటు పొందాడు. టీమిండియా స్టార్ పేసర్ బంగ్లాతో సిరీస్‌కు ముందు గాయపడటంతో అతని స్థానంలో ఉనద్కట్‌కు స్థానం దక్కింది. ఈ సిరీస్ కంటే ముగిసన విజయ్ హాజారే ట్రోఫీలో సౌరాష్ట్ర కెప్టెన్ ఉనద్కట్ అద్భుత ప్రదర్శన కనబర్చడంతో పాటు 10 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. అలాగే రంజీ సీజన్ 2019-20లో 67 వికెట్లు తీసి రాణించాడు. ఇలా దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న ఉనద్కట్‌కు 12 ఏళ్ల తర్వాత అదృష్టం తలుపుతట్టింది.
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో బరిలోకి దిగిన ఉనద్కట్.. 12 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు టీమిండియా మాజీ క్రికెటర్ పార్థీవ్‌పటేల్ పేరిటి ఉండేది. పార్థీవ్ 8 ఏళ్ల తర్వాత టెస్టు టీమ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత టీమిండియా టెస్ట్ టీమ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్‌గా ఉనద్కట్ నిలిచాడు. ప్రస్తుతం బంగ్లాతో టెస్టులో 11 ఓవర్లు వేసిన ఉనద్కట్ 2 మెయిడెన్ ఓవర్లు వేసి 40 రన్స్ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ జాకీర్ హసన్‌తో పాటు, సీనియర్ ప్లేయర్ రహీమ్‌ను అవుట్ చేశాడు. మరి ఉనద్కట్ రీ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A moment to remember for Unadkat in his life. pic.twitter.com/ZVC2hmMXZf
— Johns. (@CricCrazyJohns) December 22, 2022