జస్ప్రిత్ బుమ్రా.. ఈ పేరు వింటేనే క్రికెట్ ప్రేక్షకుల కళ్లల్లో తెలియని ఉత్సాహం కనిపిస్తుంది. అతను బంతి అందుకోగానే వికెట్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తుంటారు. కానీ, కొన్నాళ్లుగా ఫిట్‌నెస్ సమస్యల కారణంగా బుమ్రా టీమ్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆసియా కప్‌కు పూర్తిగా దూరంగా ఉన్న బుమ్రా.. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్‌కు దురంగా ఉన్నా కూడా చివరి రెండు మ్యాచ్‌లు ఆడి పర్వాలేదనిపించుకున్నాడు. ఇంక సౌతాఫ్రికాతో జరుగుతున్న 3 టీ20ల సిరీస్‌కు కూడా ఎంపికైన బుమ్రా తొలి మ్యాచ్‌కు మాత్రం దూరంగా ఉన్నాడు. అయితే బుమ్రా మాటిమాటికి ఫిట్‌నెస్ సమస్యలతో తప్పుకోవడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వార్త టీమిండియా అభిమానులకు చేదు వార్తనే చెప్పాలి. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్‌కి బుమ్రా పూర్తిగా దూరం అయిపోయాడు. అసలు అతను వరల్డ్ కప్ ఆడే పరిస్థితి లేదు. అతను రాబోయే టీ20 వరల్డ్ కప్ నుంచి పూర్తిగా తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ వర్గాలు ఇలా అంటున్నాయని కొన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి. వాటి వివరాల ప్రకారం.. బుమ్రా గత కొద్ది రోజులగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. అయితే అందుకు సర్జరీలు ఏమీ అవసరం లేకపోయినా.. వైద్యులు మాత్రం 4 నుంచి 6 నెలల విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా అతను ప్రయాణాలు కూడా చేసేందుకు వీలులేదని వైద్యులు చెప్పారంట. కాబట్టి జస్ప్రిత్ బుమ్రా ఆస్ట్రేలియాలో జరగబోయే ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఆడే పరిస్థితి లేదని తేల్చేశారు. ఈ వార్త విన్న టీమిండియా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతను కోలుకని త్వరగా అందుబాటులోకి రావాలంటూ ఆకాంక్షిస్తున్నారు.
🚨 UPDATE 🚨
Jasprit Bumrah complained of back pain during India’s practice session on Tuesday. The BCCI Medical Team assessed him. He is ruled out of the first #INDvSA T20I.#TeamIndia
— BCCI (@BCCI) September 28, 2022
Jasprit Bumrah ruled out of the T20 World Cup 2022. (Source – @kushansarkar)
— Johns. (@CricCrazyJohns) September 29, 2022
🚨 BREAKING NEWS 🚨
A big blow to Team India as Jasprit Bumrah is ruled out of T20 World Cup due to a serious back stress fracture.
– BCCI sources#JaspritBumrah #TeamIndia #T20WorldCup #T20WorldCup2022 #Cricket pic.twitter.com/L7T8qg4Wcv— ProBatsman (@probatsman) September 29, 2022