సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించింది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు గడగడలాడించారు. 3 ఓవర్లు పూర్తి కాకముందే 9 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ.. మార్కరమ్(25), పార్నెల్(24), కేశవ్ మహరాజ్(41) పోరాటంతో సౌతాఫ్రికా వంద పరుగుల మార్క్‌ను దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 106 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, దీపక్ చాహర్ 2, హర్షల్ పటేల్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.
ఈ స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన టీమిండియాను సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడా వణికించాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో రబాడా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. 7వ ఓవర్‌లో నూర్జే విరాట్ కోహ్లీ(3)ని అవుట్ చేయడంతో టీమిండియా మరింత కష్టాల్లోపడింది. పవర్‌ప్లేలో టీమిండియా అత్యంత దారుణంగా కేవలం 17 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా ఇన్నింగ్స్ ఇంత స్లోగా సాగడానికి ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్సే కారణమని మ్యాచ్ అనంతరం విమర్శలు వస్తున్నాయి. టీమిండియా మ్యాచ్ గెలిచినా.. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేసినా.. టీ20 ఫార్మాట్‌కు కేఎల్ రాహుల్ స్ట్రాటజీ సరికాదని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో 51 పరుగులు చేసేందకు రాహుల్ 56 బంతులు తీసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ వేగంగా ఆడటంతో విజయం ఈజీ అయింది కానీ.. రాహుల్ ఆడిన తీరుతో అతను కూడా ఆడి ఉంటే మ్యాచ్ పరిస్థితి కచ్చితంగా వేరుగా ఉండేది.
9 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది. అందులో కేఎల్ రాహుల్ ఒక్కడే 31 బంతులు ఆడి కేవలం 14 పరుగులు చేశాడు. ఇంత స్లోగా ఆడితే టీ20 క్రికెట్‌లో ఎలా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. టార్గెట్ తక్కువ ఉండి, సూర్యకుమార్ వేగంగా ఆడటంతో సరిపోయింది కానీ.. లేకుంటే ఏంటి పరిస్థితి అంటూ క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇలా కేఎల్ రాహుల్‌పై ఒక వైపు విమర్శలు వస్తుంటే.. మరో వైపు అతను ఆడిన ఇన్నింగ్స్ మరికొంత సమర్ధిస్తున్నారు.
బౌలింగ్ పిచ్ అనుకూలంగా ఉంది, అప్పటికే రోహిత్, కోహ్లీ అవుట్ అవ్వడంతో కేఎల్ రాహుల్ వికెట్ కాపాడుకునే ప్రయత్నంలో స్లోగా ఆడాడని అంటున్నారు. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌లో 4 సిక్సులు ఉన్న విషయాన్ని మర్చిపోవద్దని పేర్కొంటున్నారు. టార్గెట్ తక్కువ ఉన్న కారణంగా వెంటవెంటనే వికెట్లు పడటంతో కొంత స్లోగా ఆడినా.. పర్వాలేదని ఒక ప్లాన్ ప్రకారం రాహుల్ బ్యాటింగ్ చేసినట్లు అతని మద్దతుదారులు వెనకేసుకోస్తున్నారు. పైగా కేఎల్ రాహుల్ చాలా కాలం ఆటకు దూరమయ్యాడని.. అతను కొంత గేమ్ టైమ్ తీసుకోవడంలో తప్పు లేదంటున్నారు. కాగా.. రాహుల్ ఆడిన ఇన్నింగ్స్‌పై మరికొంతమంది ఫ్యాన్స్ మాత్రం అతను ఆడిన తీరును మెచ్చుకోవాలా? తప్పుబట్టాలనే సందిగ్ధంలోనే ఉన్నారు.
KL Rahul 50(56)… perfect TukTuk Inning to show how can one make academy happy and team as well🔥
KL Sir street won’t forget your this inning for a long time🙇♂️ #INDvRSA pic.twitter.com/V7LgFFzg1y— TukTuk Academy (@TukTuk_Academy) September 28, 2022
Kl Rahul’s ipl mode on😂😂
Biggest scam of international cricket..😂😂#INDvsSA #KLRahul #INDvSA pic.twitter.com/2osWOuuo8R
— Satyam Singh (@Satyamthakur004) September 28, 2022
ఇది కూడా చదవండి: 9 పరుగులిచ్చి 5 వికెట్లు కూల్చినా.. టీమిండియా బౌలర్ల వైఫల్యం బట్టబయలు!