సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం టీమిండియాలో బిగ్‌స్టార్. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల తర్వాత అంతటి ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెటర్. తన 360 డిగ్రీ బ్యాటింగ్‌తో అతి తక్కువ కాలంలోనే ఇండియన్ టీమ్‌కు బ్యాక్‌బోన్‌గా మారిపోయాడు. సౌతాఫ్రికా మాజీ క్రికెట్ ఏబీ డివిలియర్స్ లాంటి బ్యాటింగ్ స్టైల్‌తో ఇండియన్ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌గా పేరుతెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్ అలియాస్ స్కై.. తన బిరుదుకు తగ్గట్లే గ్రౌండ్‌కు అన్ని వైపులా కళ్లు చెదిరే షాట్లు ఆడుతూ.. స్టార్ ప్లేయర్‌గా మారిపోయాడు. విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా టాపార్డర్‌కు ఆపద్బాంధవుడిలా మారిపోయాడు. జాతీయ జట్టులోకి వచ్చి అతి తక్కువ కాలంలో సూర్యకుమార్ తెచ్చుకున్న పేరు, పాపులారిటీ మరే క్రికెటర్‌కు దక్కలేదన్నది కాదనలేని నిజం. అందుకు అతని ఆటే కారణం.
ఇలాంటి ఆటగాడిని గుర్తించడంలో టీమిండియా మాజీ ఆటగాడు, కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు రెండు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన కెప్టెన్ గౌతమ్ గంభీర్ విఫలం అయ్యాడు. చాలా విషయాల్లో అనేక మందిని దారుణంగా విమర్శించే గంభీర్.. తన టీమ్‌లో కొన్ని ఏళ్ల పాటు ఆడిన ఆటగాడి టాలెంట్‌ను గుర్తించలేకపోయాడు. అతన్ని ఏ స్థానంలో ఆడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చనే విషయాన్ని పట్టుకోలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ 2012లోనే ముంబై ఇండియన్స్‌కు ఆడి ఐపీఎల్ అరంగేట్రం చేసినా.. పేరొచ్చింది మాత్రం కేకేఆర్ ఆడిన తర్వాతే. 2014-2017 వరకు సూర్యకుమార్ యాదవ్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ టైమ్‌లో గంభీర్ కేకేఆర్ కెప్టెన్. తుది జట్టులో సూర్యకు ప్లేస్ ఇస్తున్నా.. బ్యాటింగ్‌కు దింపే స్థానంలో గంభీర్ ఫెయిల్ అయ్యాడు.
2014 ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్-కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన 5 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసి నాటౌట్ ఉంటాడు. ఆ మ్యాచ్‌లో కేకేఆర్ విజయం సాధిస్తుంది. ఇక ఇక్కడి నుంచి కేకేఆర్‌లో సూర్య రెగ్యులర్ ప్లేయర్‌గా మారినప్పటికీ.. బ్యాటింగ్ ఆర్డర్‌లో మాత్రం చివర్లో ఉండిపోయాడు. అయినా కూడా తనకు వచ్చిన కొన్ని బంతుల్లోనే వీలైన్ని ఎక్కువ పరుగులు చేస్తూ వచ్చాడు. 2015 సీజన్‌లో మళ్లీ ముంబై ఇండియన్స్‌పైనే 20 బంతుల్లో 46 పరుగులు చేసి కేకేఆర్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఆ ఇన్నింగ్స్‌లో ఏకంగా 5 సిక్సులు కొట్టాడు. ఇక్కడి నుంచి 2016 వరకు సూర్యకుమార్ యాదవ్‌ను గంభీర్ 4వ స్థానంలోనే బ్యాటింగ్ దింపాడు. మళ్లీ తిరిగి 2017లో లోయర్ ఆర్డర్‌కు పరిమితం చేశాడు.
2018లో సూర్యకుమార్ యాదవ్‌ను వేలంలో దక్కించుకున్న ముంబై ఇండియన్.. అతన్ని 4వ స్థానంలోనే ఆడించింది. ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సూర్య టాలెంట్‌ను గమనించి.. అతనికి సరిపోయే బ్యాటింగ్ ఆర్డర్ కట్టబెట్టాడు. అక్కడి నుంచి సూర్య వెనుదిరిగి చూసుకోలేదు. ముంబై కెప్టెన్ రోహితే టీమిండియాకు కెప్టెన్ కావడంతో సూర్యకుమార్ అదే 4వ స్థానంలో అదరగొడుతున్నాడు. కాగా.. సూర్యకుమార్‌లోని టాలెంట్‌ను గౌతమ్ గంభీర్ కనుక 2014లోనే గమనించి ఉంటే.. ఇప్పటికే సూర్య ఒక రేంజ్‌లో ఉండేవాడు. జాతీయ జట్టులోకి ఇంతకంటే ముందే వచ్చేసే వాడు. ఐపీఎల్ ఆడిన టైమ్‌లోనే జాతీయ జట్టు కూడా ఆడి అద్భుతాలు చేసేవాడు. కేవలం కెప్టెన్‌గా గంభీర వైఫల్యంతోనే సూర్యకుమార్ యాదవ్ కెరీర్‌లో కొంత వెనుక బడ్డాడని అతని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా.. సూర్యకుమార్ యాదవ్ అభిమాన క్రికెటర్ గౌతమ్ గంభీరే కావడం విశేషం.
Suryakumar Yadav: Gautam Gambhir is my favourite cricketer. Read Here:- https://t.co/oYyIr5IrzD pic.twitter.com/znCY0XsITG
— CricFit (@CricFit) November 6, 2015
ఇది కూడా చదవండి: 9 పరుగులిచ్చి 5 వికెట్లు కూల్చినా.. టీమిండియా బౌలర్ల వైఫల్యం బట్టబయలు!